Airtel Airfiber: ఎయిర్‌టెల్‌ నుంచి ఎయిర్‌ ఫైబర్‌.. ప్లాన్‌ వివరాలు ఇవే..!

Airtel Xstream AirFiber: ఎయిర్‌టెల్‌ సంస్థ ఎయిర్‌ ఫైబర్‌ సేవలను ప్రారంభించింది. తొలి దశలో దిల్లీ, ముంబయి నగరాల్లో ఈ సేవలను ప్రారంభించింది. త్వరలో దేశవ్యాప్తంగా దశలవారీగా దీనిని విస్తరించనుంది.

Published : 07 Aug 2023 13:58 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ (Airtel).. ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ (Xstream AirFiber) పేరిట ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ సర్వీసులను ప్రారంభించింది. తొలుత దిల్లీ, ముంబయి నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. ఫైబర్‌ నెట్‌వర్క్‌ అందుబాటులో లేని నగరాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో బ్రాండ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ అందించేందుకు ఈ ఎయిర్‌ ఫైబర్‌ సేవలు ఉపయోగపడతాయని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

‘‘దేశంలో ఫైబర్‌ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు అడ్డంకులున్నాయి. ఎయిర్‌ఫైబర్‌ ఆ లోటును పూడ్చనుంది. ప్రతి ఇంటికి వైఫై సర్వీసుల అందించేందుకు దీంతో వీలు పడుతుంది. తొలుత దిల్లీ, ముంబయి నగరాల్లో దీన్ని ప్రారంభిస్తున్నాం. త్వరలో దేశవ్యాప్తంగా సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని ఎయిర్‌ కన్జూమర్‌ బిజినెస్‌ డైరెక్టర్‌ సారస్వత్‌ శర్మ తెలిపారు. మేకిన్‌ ఇండియా ప్రోగ్రామ్‌ కింద ఎయిర్‌ ఫైబర్‌ డివైజులను తయారుచేసినట్లు పేర్కొన్నారు.

అధునాతన ఫీచర్లతో టాటా పంచ్‌ సీఎన్‌జీ

ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ అనేది ప్లగ్‌ అండ్‌ ప్లే డివైజ్‌. వైఫై 6 టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. గరిష్ఠంగా దీనికి 64 డివైజులను కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్‌ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయొచ్చు. ఫైబర్‌ డివైజ్‌ కొనుగోలు చేశాక ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. డివైజ్‌ మీద ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఎయిర్‌ ఫైబర్‌ నెలవారీ ప్లాన్‌ రూ.799గా ఎయిర్‌టెల్‌ నిర్ణయించింది. 100 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ సేవలు అందుతాయి. ఆరు నెలలకు కలిపి ఒకేసారి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్‌ కింద మరో రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా డిస్కౌంట్‌ పోగా రూ.7,733 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సింగిల్‌ ప్లాన్‌ మాత్రమే అందుబాటులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని