Tata Punch iCNG: అధునాతన ఫీచర్లతో టాటా పంచ్‌ సీఎన్‌జీ

Tata Motors launches Punch iCNG: టాటా మోటార్స్ నుంచి కొత్త కారు విడుదలైంది. సీఎన్‌జీ వేరియంట్‌ పంచ్‌ను టాటా మోటార్స్‌ తీసుకొచ్చింది.

Published : 04 Aug 2023 15:37 IST

దిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ (Tata motors) తన మైక్రో ఎస్‌వీయూ మోడల్‌.. పంచ్‌ సీఎన్‌జీ (Tata Punch CNG) వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. టాటా పంచ్‌ ఐసీఎన్‌జీ (Punch iCNG) పేరిట దీన్ని తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.7.1 లక్షలుగా (ఎక్స్‌ షోరూం, దిల్లీ) టాటా మోటార్స్‌ నిర్ణయించింది. హై ఎండ్‌ వేరియంట్‌ ధర రూ.9.68 లక్షలుగా పేర్కొంది.

కొత్త పంచ్‌లో ట్విన్‌ సిలిండర్‌ టెక్నాలజీని టాటా మోటార్స్‌ వినియోగించింది. అలాగే కొన్ని భద్రతా పరమైన ఫీచర్లనూ జోడించింది. ఫ్యూయల్‌ నింపే సమయంలో ఇంజిన్‌ కటాఫ్ అయ్యే విధంగా మైక్రో స్విచ్‌ సదుపాయాన్ని ఇస్తోంది. దీంతో పాటు థర్మల్‌ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్‌ అందిస్తున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు అంటే ఉష్ణోగ్రతలు పెరిగి గ్యాస్‌ లీకైతే.. థర్మల్‌ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్‌ ఇంజిన్‌కు సీఎన్‌జీ సరఫరాను నిలిపివేసి, ఆ గ్యాస్‌ను వాతావరణంలోకి విడుదల చేస్తుందని టాటా మోటార్స్ పేర్కొంది.

‘ఐటీ రిఫండ్‌.. అని మెసేజ్‌ వచ్చిందా..?’: కేంద్రం హెచ్చరిక

అలాగే, ఇందులో వాయిస్‌ అసిస్టెంట్ ఆధారిత ఎలక్ట్రిక్‌ సన్‌ రూఫ్‌ను అందిస్తున్నారు. ఆటోమేటిక్‌ ప్రొజక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌, 16 అంగుళాల డైమండ్‌ కట్‌ అల్లాయ్‌ వీల్స్‌ ఇస్తున్నారు. అలాగే, 7 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ అందిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లేకు సపోర్ట్‌ చేస్తుంది. రెయిన్‌ సెన్సింగ్‌ వైపర్స్‌, డ్రైవర్‌ సీటు హైట్‌ను అడ్జస్ట్‌ చేసుకోవడం వంటి అత్యాధునిక ఫీచర్లనూ ఇందులో ఇస్తున్నారు.

మరోవైపు పంచ్‌లో తీసుకొచ్చిన ట్విన్‌ సిలిండర్‌ టెక్నాలజీని టియాగో, టిగోర్‌ మోడళ్లలోనూ తీసుకొచ్చినట్లు టాటా మోటార్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది. టియాగో సీఎన్‌జీ ధర రూ.6.55 లక్షలు నుంచి రూ.8.1 లక్షలు.. టిగోర్‌ సీఎన్‌జీ రూ.7.8 లక్షల నుంచి రూ.8.95 లక్షల మధ్య ఉంటుందని టాటా మోటార్స్ పేర్కొంది. వీటి వల్ల కంపెనీ సీఎన్‌జీ లైనప్‌ మరింత బలోపేతం అవుతుందని కంపెనీ పాసింజర్‌ వెహికల్‌ మార్కెటింగ్‌ హెడ్ వినయ్‌ పంత్‌ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని