Apple Event: టెక్‌ ప్రియులకు పండగే.. యాపిల్‌ ఈవెంట్‌ డేట్‌ వచ్చేసింది..

Eenadu icon
By Business News Team Updated : 27 Aug 2024 00:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా టెక్‌ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్‌ ఈవెంట్‌ (Apple Event) డేట్‌ ఫిక్స్‌ అయింది. సెప్టెంబర్‌ 9న దీన్ని నిర్వహించనున్నట్లు యాపిల్‌ ప్రకటించింది. తమ సంస్థ కొత్త ఉత్పత్తులు, వాటి ఫీచర్లకు సంబంధించి యాపిల్‌ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనికి విశేషమైన క్రేజ్‌ ఉంది. ఏటా సెప్టెంబర్‌ రెండో వారంలో యాపిల్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌ 12న కాలిఫోర్నియా వేదికగా జరగగా, అంతకుముందు ఏడాది సెప్టెంబర్‌ 7న ఈవెంట్‌ను నిర్వహించారు. ఈసారి సెప్టెంబర్‌ 10న నిర్వహించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆశ్చర్యకరంగా ఒకరోజు ముందుగానే యాపిల్‌ ఈవెంట్‌ డేట్‌ను ప్రకటించింది.      

ఈ ఈవెంట్‌లో యాపిల్‌ ఐఫోన్‌ 16 సిరీస్‌, యాపిల్‌ వాచ్‌, ఎయిర్‌పాడ్స్‌ ప్రొడక్ట్స్‌, కొత్తగా హార్డ్‌వేర్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఈవెంట్‌ ట్యాగ్‌ లైన్‌ను ‘‘ఇట్స్‌ గ్లోటైమ్‌’గా పేర్కొన్నారు. ఇది యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ను సూచిస్తుంది. ఇక రానున్న ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో రానున్నట్లు సమాచారం.  

కాలిఫోర్నియాలోని స్టీవ్‌ జాబ్స్‌ థియేటర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో ఇది స్ట్రీమింగ్‌ కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక ఐఫోన్‌ 16 సిరీస్‌లతో పాటు ఈ ఈవెంట్‌లో భారీగా కొత్త ఉత్పత్తులకు సంబంధించి ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇక ఐఓస్‌ 18తో పాటు ఇతర సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లను సైతం వెల్లడించే అవకాశం ఉంది. ఇక ఐఫోన్‌ 16 సిరీస్‌ విషయానికి వస్తే.. మొత్తం నాలుగు మోడళ్లు ఐఫోన్‌ 16, ఐఫోన్‌ ప్లస్‌, ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మాక్స్‌ ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి అన్ని మోడళ్లలో యాక్షన్‌ బటన్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతసారి ప్రో మోడల్స్‌లో మాత్రమే యాక్షన్‌ బటన్‌ను పరిచయం చేశారు. బేసిక్‌ ఐఫోన్లలో తొలిసారిగా ఐకానిక్‌ అలర్ట్‌ స్లైడర్‌ను ఈ కొత్త ఫీచర్‌తో రిప్లేస్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సారి అన్నిమోడళ్లు లేటెస్ట్‌ జెన్‌ హార్డ్‌వేర్‌, ఏఐతో రానున్న నేపథ్యంలో యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. 

Tags :
Published : 27 Aug 2024 00:06 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని