Credible Broker: మధ్యవర్తి ద్వారా ఇల్లు కొంటున్నారా? ఇలాంటి వారినే ఎంచుకోండి!
Credible Broker: ఇల్లు కొనేటప్పుడు మనకు మధ్యవర్తులు కొంత సాయంగా ఉంటారు. అయితే, సరైన మధ్యవర్తిని ఎంచుకుంటేనే ఉపయోగం. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి మనం ఎంచుకునే మధ్యవర్తిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చూద్దాం..!
ఇంటర్నెట్ డెస్క్: ఇల్లు కొనేటప్పుడు అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. సమర్థమైన, విశ్వసనీయమైన మధ్యవర్తి (Broker) ద్వారా కొనుగోలు చేస్తే వీటిలో కొన్నింటిని అధిగమించే అవకాశం ఉంటుంది. అయితే, మార్కెట్‌లో ఉన్న బ్రోకర్లను అంత గుడ్డిగా నమ్మొద్దు. వ్యాపారం కోసం, అలాగే వారికి ఉండే కొన్ని పరిమితుల రీత్యా కొన్ని అవాస్తవాలు చెప్పి మనకు ప్రాపర్టీని అంటగట్టే ప్రమాదం లేకపోలేదు. అందుకే సమర్థమైన బ్రోకర్‌ను ఎంచుకోగలిగితే సగం సమస్యలు తీరినట్లే.
బ్రోకర్ వివరాలు తనిఖీ చేయండి..
బ్రోకర్‌కు సంబంధించిన కొన్ని ప్రాథమిక వివరాలు తెలుసుకుంటే అవి వారి విశ్వసనీయతను తెలియజేస్తాయి. సదరు వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ ‘స్థిరాస్తి ప్రాధికార సంస్థ (రెరా)’ వద్ద నమోదై ఉండాలి. అలాగే అతను/ఆమె ఏదైనా అసోసియేషన్‌లో భాగస్వాములుగా ఉన్నారేమో ఆరా తీయండి. ‘జాతీయ స్థిరాస్తి వ్యాపారుల సంఘం (NAR)’ వంటి వాటిలో రిజిస్టరై ఉంటే మంచిది. ఒకవేళ అతను ఏదైనా పొరపాటు చేస్తే అసోసియేషన్‌లో ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్రోకర్‌కు ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ఉందేమో కనుక్కోండి. స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నవారికి మహారాష్ట్ర రెరా 20 గంటల కోర్సును అందించి పరీక్ష కూడా నిర్వహిస్తోంది. అందులో వారి ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్ అందిస్తోంది. ఇవన్నీ ఒక బ్రోకర్ విశ్వసనీయమైన వ్యక్తి అని చెప్పడానికి కొలమానాలేం కాదు. కానీ, సరైన స్థిరాస్తి నిపుణుడి దగ్గరకు వెళ్లడానికి ఇవన్నీ దోహదం చేస్తాయి.
అనుభవం..
సదరు మధ్యవర్తి అనుభవం కూడా చాలా ముఖ్యమైన అంశం. ఎక్కువ అనుభం ఉన్నవారైతే ఇంటి కొనుగోలులో ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. అలాంటి వారు చాలా మంది క్లయింట్లను చూసి ఉంటారు. ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ముందే చెప్పగలుగుతారు. అలాగే గత అనుభవాల దృష్ట్యా అవాస్తవాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. కనీసం 10 ఏళ్ల అనుభవం ఉన్న బ్రోకర్లయితే మేలని నిపుణులు సూచిస్తుంటారు.
స్థానిక మార్కెట్‌పై పట్టు..
కొనుగోలుదారుడు తన అవసరాలు చెప్పినప్పుడు బ్రోకర్ వివిధ రకాల ప్రత్యామ్నాయాలను ముందుంచగలగాలి. అతని దగ్గర ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే సదరు బ్రోకర్ దగ్గర అమ్మకానికి ఎన్ని ఇళ్లు ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. అలాగే ఆ స్థానిక మార్కెట్‌లో ధరలు ఎలా ఉన్నాయో కూడా కనుక్కోవాలి. తద్వారా ఆ ఏరియాపై అతనికి ఎంత పట్టుందో పసిగట్టాలి. ఇతర మౌలిక వసతులు అతను చెప్పిన విధంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలాగే రాబోయే రోజుల్లో ఆ ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్టులు రాబోతున్నాయి? ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతోంది? వాటికి సంబంధించిన అధికారిక ప్రణాళికల సమాచారం గురించి కూడా తెలుసుకోవాలి.
సిఫార్సు చేసిన వ్యక్తే మేలు..
కేవలం వాణిజ్య ప్రకటనలు, వారిచ్చే ఆధారాలను బట్టి బ్రోకర్‌ను ఎంచుకోవడం అంత మంచిది కాదు. గతంలో అతను సర్వీస్ అందించిన కస్టమర్ల వివరాలు కనుక్కోండి. కనీసం ఓ నలుగురు లేదా ఐదుగురిని సంప్రదించండి. బ్రోకర్ గురించి అడిగి తెలుసుకోండి. అలాగే మంచి మధ్యవర్తి కోసం మిత్రులు, బంధువుల దగ్గర కూడా ఆరా తీయండి. ఎక్కువ మంది సిఫార్సు చేసిన వ్యక్తినే ఎంచుకుంటే మేలు. ఆన్‌లైన్‌లోనూ వారి గురించి వెతకండి. వారి సోషల్ మీడియా ఖాతాలపైనా ఓ లుక్కేయండి. చాలా మంది క్లయింట్లు ఈ మధ్య తమ అభిప్రాయాన్ని ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్‌లో కామెంట్ల రూపంలో ఉంచుతున్నారు. మరోవైపు గూగుల్ రివ్యూలు కూడా ఈ విషయంలో ఉపయోగపడతాయి.
పొదుపు తగ్గి అప్పు పెరుగుతోందా? ఈ వ్యూహాలను అనుసరిద్దాం!
ధరలపై మంచి అవగాహన ఉండాలి..
మనం ఎంచుకున్న మధ్యవర్తికి ఆయా ప్రాంతాల్లో ప్రాపర్టీల విలువపై మంచి అవగాహన ఉండాలి. స్థలం, నిర్మాణ ఖర్చులు, ఇంటీరియర్స్, ఇతర వసతులకయ్యే కనీస ఖర్చులు ఎలా ఉంటాయో చెప్పగలగాలి. తద్వారా ఓ ఇంటికి ఎంత వరకు పెట్టొచ్చో అంచనా వేయగలగాలి.
ఎక్కువ బ్రోకరేజీ చెల్లించొద్దు..
ప్రాంతాన్ని బట్టి బ్రోకరేజీ (Brokerage) మారుతుంటుంది. దేశ రాజధాని దిల్లీలో కొనుగోలుదారులు 1 శాతం, అమ్మకందారులు 1 శాతం చెల్లిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. దీనికి జీఎస్టీ అదనం. అదే బెంగళూరులో ఇది వరుసగా 1 శాతం, 2 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కొంత మంది డాక్యుమెంటేషన్‌కు అదనంగా ఛార్జ్ చేస్తుంటారు. అందుకే ముందే మధ్యవర్తి నుంచి అతనికి చెల్లించాల్సిన మొత్తం గురించి స్పష్టత తీసుకోవాలి. జీఎస్టీ, డాక్యుమెంటేషన్, ఇతర అదనపు రుసుముల గురించి ముందే తెలుసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిల్లలకు ఆర్థిక భద్రత..
యూనియన్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా యూనియన్ చిల్డ్రన్ ఫండ్ అనే పథకాన్ని ఆవిష్కరించింది. ఇది ఓపెన్ ఎండెడ్ పథకం. కానీ, కనీసం అయిదేళ్లపాటు లేదా మైనర్ పిల్లలు మేజర్ అయ్యే వరకూ లాకిన్ నిబంధన వర్తిస్తుంది. -
ప్రయాణ బీమా..క్లెయిం చేసుకోవాలంటే...
-
పన్ను ప్రణాళిక ఆర్థిక లక్ష్యం నెరవేరేలా...
ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలల్లో ముగియనుంది. ఇప్పటికే చాలామందికి మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) ప్రారంభమయ్యింది. ఈ సమయంలో పన్ను భారం తగ్గించుకునేందుకు సరైన పెట్టుబడులను ఎంచుకోవాలి -
ఆదాయం.. బీమా రక్ష జీవితాంతం..
బీమా రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) పొదుపు, బీమాతోపాటు, హామీతో కూడిన ఆదాయాన్ని అందించేలా ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. అదే జీవన్ ఉత్సవ్. నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు, జీవితాంతం వరకూ బీమా రక్షణ అందించే పాలసీ. -
December deadline: ఆధార్ అప్డేట్.. బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్.. డిసెంబర్ డెడ్‌లైన్స్ ఇవే!
December 2023 money deadlines: 2023 సంవత్సరానికి దాదాపు చివరకు వచ్చేశాం. ఈ ఒక్క నెలా ఆగితే ఏడాది పూర్తవుతుంది. సంవత్సరమే కాదు అనేక పథకాల డెడ్‌లైన్ కూడా 31తో ముగియనుంది. -
Money Education: పిల్లలకు డబ్బు గురించి ఎలాంటి అవగాహన కల్పించాలి?
చాలా మంది పిల్లలకు తెలియని ముఖ్యమైన అంశాల్లో డబ్బు ప్రాముఖ్యత ఒకటి. డబ్బు, ఖర్చుల విషయంపై పిల్లలను మొదటగా తల్లిదండ్రులే తీర్చిదిద్దాలి. -
Home Rent: ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఇల్లు అద్దెకు తీసుకోవడం ప్రయోజనమేనా?
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు డిజిటల్ సాంకేతికత చాలా పెరిగింది. ఇంటిని ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా అద్దెకు తీసుకోవడం ప్రస్తుతకాలంలో పెరిగింది. -
బ్యాంకింగ్ రంగంలో పెట్టుబడి..
డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ ఒక బ్యాంకింగ్-ఆర్థిక సేవల పథకాన్ని ఆవిష్కరించింది. డీఎస్పీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ వచ్చే నెల 4. ఇది ఓపెన్ ఎండెడ్ తరగతికి చెందిన థీమ్యాటిక్ ఫండ్. ఎన్ఎఫ్ఓలో కనీసం రూ.100 పెట్టుబడి పెట్టాలి -
వాహనానికి ధీమాగా
మన దేశంలో దాదాపు 30 కోట్లకు పైగా మోటారు వాహనాలున్నాయని అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. ఇందులో 50 శాతం వాహనాలకే బీమా రక్షణ ఉంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం కనీసం థర్డ్ పార్టీ బీమా ఉండాలన్న నిబంధన ఉంది. -
పెద్దల పొదుపు పథకం నిబంధనలు మారాయ్
క్రమం తప్పకుండా ఆదాయం కావాలనుకునే పెద్దలకు ఉన్న పథకాల్లో చెప్పుకోదగ్గది సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీం. ఇటీవల ఈ పథకంలో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది -
జీవిత బీమా లాభాల్లో వాటా కావాలంటే...
కుటుంబంలో ఏదైనా అనుకోని కష్టం వచ్చినప్పుడు ఆర్థిక స్థిరత్వాన్ని అందించేది జీవిత బీమా. అందుకే, సరైన అవగాహనతో పాలసీని ఎంచుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్, యులిప్, యాన్యుటీవంటి అనేక రకాల్లో దేన్ని ఎంచుకోవాలనేది నిర్ణయించుకునే ముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. -
Insurance: బీమా విషయంలో ఈ తప్పులు చేయొద్దు!
బీమా ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. దీని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూడండి. -
Financial Mistakes: బడ్జెట్, ఖర్చుల విషయంలో మీరూ ఈ తప్పులు చేస్తున్నారా?
చాలా మంది తమ ఖర్చుల విషయంలో అనేక తప్పులు చేస్తుంటారు. స్వతహాగా చేసే కొన్ని అనవసర (వృథా) ఖర్చుల గురించి ఇక్కడ తెలుసుకోండి.. -
Investment Mistakes: పెట్టుబడిదారులు సాధారణంగా చేసే తప్పులివే!
ఆర్థిక ప్రణాళిక నిర్వర్తించేటప్పుడు చాలా మంది అనేక తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు ఎలా నివారించాలో ఇప్పుడు చూద్దాం.. -
జీవిత బీమా పన్ను ఆదాకు మించి..
ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరకు వస్తుందంటే... పన్ను ఆదా గురించి ఆలోచనలు మొదలవుతాయి. చాలామంది దీనికోసం జీవిత బీమా పాలసీని ఎంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. -
కొనసాగాలి... లక్ష్యం సాధించేదాకా
కొత్తగా మ్యూచువల్ ఫండ్లలోకి వస్తున్న దేశీయ మదుపరుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. భారతీయ మ్యూచువల్ ఫండ్ల సంఘం (యాంఫీ) గణాంకాల ప్రకారం ఫండ్ల నిర్వహణలో ఉన్న సగటు ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.46.71 లక్షల కోట్లు. -
కొత్త జంటకు ఆర్థిక పాఠాలు
నిన్నటి వరకూ ఎవరికి వారే అన్నట్లున్న వారు.. వివాహంతో ఒకటిగా మారతారు. మనం అనే భావనతో భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. -
ఆరోగ్య బీమా అపరిమితంగా
పాలసీ మొత్తం ఖర్చవగానే, తిరిగి 100 శాతం భర్తీ అయ్యే సౌలభ్యంతో స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కొత్త పాలసీని తీసుకొచ్చింది. -
వెండిలో మదుపు...
ఎడిల్వీజ్ మ్యూచువల్ ఫండ్ ఒక సిల్వర్ ఈటీఎఫ్ పథకాన్ని ఆవిష్కరించింది. ఎడిల్వీజ్ సిల్వర్ ఈటీఎఫ్ అనే ఈ పథకం వెండిలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని మదుపరులకు కల్పిస్తోంది. -
Credit Cards: ఇన్స్టంట్ క్రెడిట్ కార్డులతో ప్రయోజనాలు ఇవే!
Instant Credit card: బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇన్స్టంట్ క్రెడిట్ కార్డులను అందజేస్తున్నాయి. వాటితో ప్రయోజనాలేమిటో చూద్దాం.. -
Personal loan: పర్సనల్ లోన్‌తో మీ క్రెడిట్‌స్కోరు దెబ్బతింటుందా?
Credit score: పర్సనల్ లోన్ విషయంలో చాలా మందికి ఓ అపోహ ఉంటుంది. వ్యక్తిగత రుణం తీసుకుంటే క్రెడిట్ స్కోరు దెబ్బతింటుందని. ఇంతకీ నిజంగానే క్రెడిట్ స్కోరు దెబ్బతింటుందా?


తాజా వార్తలు (Latest News)
-
BSF: వీర జవాన్లతో.. పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్ షా
-
Ambati Rambabu: తెలంగాణలో ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం మాకు లేదు: అంబటి
-
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20.. స్టేడియంకు ‘కరెంట్’ కష్టాలు..!
-
ఆహ్వానం అందక.. అర్ధగంట విమానం డోర్ వద్దే నిల్చున్న అధ్యక్షుడు..!
-
Animal movie review: రివ్యూ: యానిమల్.. రణ్‌బీర్-సందీప్ వంగా యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
Vladimir Putin: ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యన్ మహిళలకు పుతిన్ విజ్ఞప్తి