2030కి భారత్‌ నుంచి రూ.7 లక్షల కోట్ల ఎగుమతులు: అమెజాన్‌

Eenadu icon
By Business News Desk Published : 28 Oct 2025 03:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: అంతర్జాతీయంగా విక్రయించేందుకు 2015-2025 మధ్య తమ సంస్థ భారత్‌ నుంచి దాదాపు 1.76 లక్షల కోట్ల (20 బిలియన్‌ డాలర్ల) వస్తువులను సమీకరించినట్లు అమెజాన్‌ గ్లోబల్‌ సెల్లింగ్‌ ఇండియా అధిపతి శ్రీనిధి కల్వపూడి తెలిపారు. 2030 నాటికి భారత్‌ నుంచి ఎగుమతి అయ్యే వస్తువుల విలువ రూ.7 లక్షల కోట్లు (80 బి.డా.) మించొచ్చని అంచనా వేశారు. భారత ఉత్పత్తులపై అమెరికా అధిక సుంకాలు విధించడం తమ నియంత్రణలో లేని అంశమని.. అయినా కూడా భారత్‌ నుంచి వస్తు సమీకరణ కొనసాగిస్తామని వివరించారు. గత పది సంవత్సరాల్లో ప్రపంచ వినియోగదారులకు తమ ప్లాట్‌ఫామ్‌ ద్వారా 75 కోట్లకు పైగా ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ఉత్పత్తులను అందించినట్లు తెలిపారు. 

ఏడాది వ్యవధిలో తమ ప్లాట్‌ఫామ్‌ ద్వారా వస్తువులను ఎగుమతి చేస్తున్న వారి సంఖ్య 33% వృద్ధి చెంది 2 లక్షలకు చేరిందని..ఇందులో ఔత్సాహికులు, చిన్న వ్యాపార సంస్థల నిర్వాహకులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. దిల్లీ, రాజస్థాన్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, హరియాణ రాష్ట్రాల నుంచి అధికంగా ఎగుమతిదార్లు ఉన్నారని తెలిపారు.

ఆరోగ్య- వ్యక్తిగత సంరక్షణ (45%), బ్యూటీ (45%), బొమ్మలు (44%), గృహ సంరక్షణ (39%), వస్త్రాలు (37%), ఫర్నిచర్‌ (36%) విభాగాల నుంచి ఎగుమతులు ఎక్కువ నమోదయ్యాయని విశ్లేషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు