2025-26లో చక్కెర ఎగుమతులకు అనుమతులు!
దిల్లీ: దేశంలో చక్కెర నిల్వలు అధికంగా ఉండడం వల్ల, 2025-26 మార్కెటింగ్ ఏడాదిలో ఎగుమతులకు ప్రభుత్వం అనుమతించొచ్చని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. 2024-25 మార్కెటింగ్ సంవత్సరంలో ఇథనాల్ తయారీకి 4.5 మిలియన్ టన్నుల చక్కెర వినియోగిస్తారనుకున్నా, 3.5 మిలియన్ టన్నులు మాత్రమే తరలించడం వల్లే నిల్వలు పోగుబడ్డాయని వివరించారు. ఏటా అక్టోబరు నుంచి మరుసటి ఏడాది సెప్టెంబరును చక్కెర మార్కెటింగ్ సంవత్సరంగా పరిగణిస్తారు.
ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో 34 మిలియన్ టన్నుల పంచదార ఉత్పత్తి అవుతుందని అంచనా కాగా, దేశీయ గిరాకీ 28.5 మిలియన్ టన్నులుగా ఉండొచ్చు. గతేడాది 10 లక్షల టన్నుల చక్కెర ఎగుమతికి అనుమతి ఇవ్వగా, 8 లక్షల టన్నులనే ఎగుమతి చేశారు. ప్రస్తుతం మిల్లుల వద్ద చక్కెర సగటు ధర క్వింటాల్‌కు రూ.3,885 కాగా, అంతర్జాతీయంగా రూ.3,829 మాత్రమే కావడం గమనార్హం.
చెప్పినదాని కంటే తక్కువగా...
471 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేస్తామని 2024-25లో చక్కెర పరిశ్రమ తెలిపింది. కాని 289 కోట్ల లీటర్లు మాత్రమే ఉత్పత్తి చేసింది. మొక్కజొన్న నుంచి 478 కోట్ల లీటర్లు (45%), బియ్యం నుంచి 235 కోట్ల లీటర్ల (22%) ఇథనాల్ తయారు చేయడమే ఇందుకు కారణం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఉద్యోగుల ప్రతిభను గుర్తించేందుకు ఎస్బీఐ-స్టార్ అవార్డులు
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ ఉద్యోగుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక అవార్డులను ప్రకటించింది. - 
                                    
                                        

పెట్రోలు విక్రయాలకు పండగ జోష్
పండగ సమయంలో ప్రయాణాలు పెరగడంతో అక్టోబరులో పెట్రోల్ అమ్మకాలు 5 నెలల గరిష్ఠానికి చేరాయి. అయితే ఇందుకు భిన్నంగా డీజిల్ వినియోగంలో స్తబ్దత కొనసాగిందని ప్రభుత్వ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. - 
                                    
                                        

భారత్‌కు సౌదీ అరేబియా ఫ్లైయెడీల్ విమానాలు
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత విమానయాన విపణిపై ఆశతో, సౌదీ అరేబియాకు చెందిన ఫ్లైయెడీల్ 2026 తొలి త్రైమాసికం నుంచి ముంబయితో పాటు మన దేశంలోని పలు నగరాలకు విమానాలను ప్రారంభించనుంది. - 
                                    
                                        

ఓయో బోనస్ ఇష్యూ గడువు పొడిగింపు
బోనస్ ఇష్యూ కోసం దరఖాస్తుల తుది గడువును పొడిగించినట్లు ఆతిథ్య సేవల సంస్థ ఓయో వెల్లడించింది. నమోదుకాని ఈక్విటీ వాటాదార్ల కోసం గడువును నవంబరు 1 నుంచి 7వ తేదీకి పొడిగించినట్లు సంస్థ తెలిపింది. - 
                                    
                                        

సూచీలు పుంజుకోవచ్చు
భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. నిఫ్టీ-50 తిరిగి తన 26,000 స్థాయిని అందుకోవచ్చని అంటున్నారు. - 
                                    
                                        

పసిడి ప్రతికూలమే!
పసిడి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,22,890 కంటే ఎగువన చలించకుంటే ప్రతికూల ధోరణి కొనసాగుతుందని భావించవచ్చు. - 
                                    
                                        

సీఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగంలో అనంత్ టెక్నాలజీస్దీ పాత్ర
ఎల్వీఎం3-ఎం5 వాహక నౌక ద్వారా సీఎంఎస్-03 ఉప్రగహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించిందని అనంత్ టెక్నాలజీస్ ఛైర్మన్ సుబ్బారావు పావులూరి తెలిపారు. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు (5)
ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు టెక్ పరిశ్రమలో 218 కంపెనీలు లక్ష మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్.ఎఫ్‌వైఐ గణాంకాలు చెబుతున్నాయి. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు భూసేకరణకు ప్రభుత్వం అనుమతి
 - 
                        
                            

జోగి రమేశ్‌ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్‌శాఖ పిటిషన్
 - 
                        
                            

ఎస్వీయూలో విద్యార్థినులపై ప్రొఫెసర్ వేధింపులు.. విద్యార్థి సంఘాల ఆందోళన
 - 
                        
                            

క్రికెట్ అందరి గేమ్: హర్మన్ ప్రీత్ కౌర్
 - 
                        
                            

వారసత్వ రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు: శశిథరూర్
 - 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 


