ఒక్క ఐఫోన్‌ మార్కెట్లోకి తేవడానికి ఇన్ని ఫోన్లపై టెస్టులా?

ఐఫోన్‌ డ్యూరబిలిటీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు కంపెనీ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ అధిపతి జాన్ టెర్నస్. ఒక్క ఐఫోన్‌ మార్కెట్లోకి తేవడానికి 10 వేల కంటే ఎక్కువ ఫోన్లను పరీక్షిస్తుందన్నారు.

Published : 31 May 2024 00:20 IST

iPhones | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐఫోన్‌ అంటే వెంటనే గుర్తుకొచ్చేది దాని ప్రీమియం లుక్‌, డిజైన్‌ మాత్రమే కాదు.. దాని డ్యూరబిలిటీ కూడా. ఇతర స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే ఇవి దృఢంగా ఉంటాయి. నీటిలో పడినా.. చేతుల్లోంచి జారి ఎత్తు నుంచి కింద పడినా ఎంచక్కా పని చేస్తుంటాయి. చాలామంది ఐఫోన్లను ఇష్టపడేది ఇందుకే. ఈ ఏడాది అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం డోర్‌ ఊడిన ఘటనలో ఓ ఐఫోన్‌ 16వేల అడుగుల ఎత్తులోంచి పడినా యథావిధిగా పనిచేయడం పలువురిని ఆశ్చర్యపరిచింది. మరి ఇంతగా టెక్‌ ప్రియులను ఆకట్టుకుంటున్న ఐఫోన్‌ మార్కెట్లోకి రాక ముందు ల్యాబ్‌లో ఎన్ని టెస్టులు ఎదుర్కొంటుందో.. అందుకు ఎన్ని ఫోన్లను వినియోగిస్తారో తెలుసా?

యాపిల్‌ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ అధిపతి జాన్ టెర్నస్ ఇటీవల ఓ యూట్యూబర్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఫోన్ టెస్టింగ్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఐఫోన్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చే ముందు డ్రిప్ రెయిన్ సిమ్యులేషన్, లో ప్రెజర్‌ హీట్‌, డ్రాప్ టెస్టింగ్‌, హై-ఫ్రీక్వెన్సీ షేకింగ్ వంటి టెస్టులను యాపిల్ నిర్వహిస్తుందన్నారు. కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయడానికి ముందు ఏకంగా 10 వేలకుపైగా ఫోన్లను ఇలా పరీక్షిస్తుందని తెలిపారు. ఈ టెస్టులకు సంబంధించిన వీడియోలను కూడా సదరు యూట్యూబర్‌ ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. 

ఆర్‌బీఐ వద్ద ఎంత బ్యాలెన్స్‌ ఉందో తెలుసా?

ఐపీ రేటింగ్‌ కోసం నిర్వహించే టెస్టింగ్‌నే డ్రిప్‌ రెయిన్‌ సిమ్యులేషన్‌ అంటారు. ఈ పరీక్షలో ఐఫోన్‌లోని ప్రతీ భాగంలోకి నీటిని పంపి అది పని చేస్తుందా? లేదా? చూస్తారు. అలాగే వివిధ కోణాల్లో రోబోల సాయంతో రకరకాల మెటీరియల్స్‌పై ఫోన్‌ని పడేసి డ్రాప్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. యాపిల్‌ ఐఫోన్లు వాటర్‌ రెసిస్టెంట్‌తో వస్తాయి. నీటిలోకి తీసుకెళ్లినప్పుడు నీరు అందులోకి చేరకుండా ఉండేందుకు హై గ్రేడ్‌ జిగురును వినియోగిస్తారు. అందుకే మరమ్మతుల సమయంలో ఫోన్‌ను వేరు చేయడం కష్టంతో కూడుకున్న వ్యవహారమని టెర్నస్ చెప్పుకొచ్చారు. లేటెస్ట్‌ మోడల్‌ ఐఫోన్‌ 15ను గ్లాస్‌ బ్యాక్‌తో పాటు టైటానియంతో రూపొందించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు