Mothers Day: మాతృదినోత్సవం రోజున అమ్మకు ఈ బహుమతి ఇద్దామా!

Mothers Day: మన కోసం, మన కుటుంబం కోసం నిరంతరం శ్రమిస్తున్న అమ్మ కోసం, ఆమె ఆరోగ్యం కోసం సరైన ఆరోగ్య బీమా పాలసీని ఈ మాతృదినోత్సం సందర్భంగా మహుమతిగా ఇద్దాం!

Updated : 14 May 2023 12:20 IST

Mother's Day | ఇంటర్నెట్‌ డెస్క్‌: సృష్టిలో ఎన్ని వింతలు విశేషాలున్నా.. అమ్మకు మించిన అద్భుతం మరోటి లేదు. ‘అందరం మన గురించి మాత్రమే ఆలోచిస్తాం.. అమ్మ మాత్రమే మన గురించి ఆలోచిస్తుంది’ అన్నారు వివేకానందుడు. ఏ కష్టమొచ్చినా మనకు మొదట గుర్తుకొచ్చేది అమ్మ. ఆరోగ్యం బాగోకపోతే అమ్మ ఆశ్రయం కోసం అల్లాడుతాం. మరి మన అమ్మ ఆరోగ్యం కోసం మనం ఏం చేస్తున్నాం. మరి ఈ మాతృదినోత్సవం (Mother's Day) సందర్భంగా.. ప్రతి మహిళకు సరైన ఆరోగ్య భద్రత ఉండడం చాలా అవసరమని గుర్తిద్దాం!

కొంత మంది మహిళలకు వారి పనిచేసే కంపెనీలే బీమా (Insurance) సౌకర్యాన్ని కల్పిస్తాయి. మరికొంత మందికి ఫ్యామిలీ ఫ్లోటర్‌లో భాగంగా బీమా ఉంటుంది. కానీ, ఇప్పటికీ మన దేశంలో చాలా మంది మహిళలకు ఎలాంటి ఆరోగ్య బీమా సదుపాయం లేకపోవడం విచారించదగ్గ విషయం. ప్రతి స్త్రీకి ప్రత్యేకించి తల్లులకు ఆరోగ్య బీమా (Insurance) చాలా కీలకం. జీవితం ముందుకు సాగుతున్న కొద్దీ వారు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు పెరుగుతూ పోతాయి.

మహిళల కోసమే ప్రత్యేక ప్లాన్‌లు..

ఈ నేపథ్యంలో బీమా పరిశ్రమ సైతం మహిళల కోసం ప్రత్యేకంగా పాలసీలను అందిస్తోంది. గర్భాశయ క్యాన్సర్, యోని క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, నవజాత శిశువులకు పుట్టుకతో వచ్చే వైకల్యాలు వంటి నిర్దిష్ట అనారోగ్యాలను కవర్ చేసే ప్రత్యేక బీమా (Insurance) పథకాలు అందుబాటులో ఉన్నాయి. మహిళలు వారి ఆరోగ్య బీమా పాలసీలో భాగంగా ప్రసూతి కవరేజ్ నుంచే ప్రయోజనం పొందవచ్చు. ఇది సాధారణంగా ఎంచుకున్న బేస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తోనే కలిసి ఉంటుంది. గర్భం, ప్రసవానికి సంబంధించిన ఖర్చులను కవర్ చేస్తుంది. అంటే డెలివరీకి ముందు, ప్రసవం సమయంలో అయ్యే ఖర్చు, ఆసుపత్రిలో చేరడం, అంబులెన్స్ ఖర్చు, గది అద్దె ఛార్జీలు, తల్లీబిడ్డకు ఏవైనా ఇతర పూర్వ/ప్రసవానంతర సమస్యలు.. వంటివన్నీ పాలసీలో కవర్‌ అవుతాయి. అది సిజేరియన్ అయినా లేదా సహజ ప్రసవం అయినా బీమా వర్తిస్తుంది. సరైన ప్లాన్‌ను ఎంచుకున్నప్పుడు, పాలసీ డాక్యుమెంట్‌లోని అన్ని నిబంధనలు, షరతులను జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే కొన్ని పరిమితులు ఉండొచ్చు. ఎవరైనా తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిన నిర్దిష్ట పరిమితులు, నిరీక్షణ వ్యవధి నిబంధనలు ఎప్పుడూ ఉంటాయని గుర్తించుకోవాలి.

అనుబంధ ప్రయోజనాలు..

ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీలతో పాటు, అనేక బీమా (Insurance) కంపెనీలు ఔట్ పేషెంట్ ఖర్చులను కవర్ చేసే రైడర్ ప్రయోజనాలనూ అందిస్తాయి. వీటిలో డాక్టర్ సంప్రదింపులు, ల్యాబ్ పరీక్షల సమయంలో అయ్యే ఖర్చులు కవర్ అవుతాయి. అపరిమిత టెలీకన్సల్టేషన్‌ను అందిస్తాయి. OPD కవర్ మరొక ముఖ్య ప్రయోజనం. ముందస్తు ఆరోగ్య తనిఖీలు కూడా అదనపు వెసులుబాటు. ప్రతి వ్యక్తి సమగ్ర ఆరోగ్య ప్రణాళికను కలిగి ఉండాలి. మహిళలకు ఇది మరీ ముఖ్యం. తల్లులుగా మహిళలు విభిన్నమైన పాత్రను పోషిస్తారు. అనేక బాధ్యతలను మోస్తారు. దీని వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. సమగ్ర ఆరోగ్య బీమా పాలసీని తీసుకునేటప్పుడు తగినంత కవరేజీని కలిగి ఉండటానికి మానసిక అనారోగ్య చికిత్స, టాప్-అప్ పాలసీలను విస్తరించే వెసులుబాటు ఉన్న ప్లాన్‌ను ఎంచుకోవాలి.

అమ్మకు దూరంగా ఉన్నా..

వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వల్ల కొంతమంది తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడం అంత సులభమైన అంశం కాదు. అందుకే బీమా సంస్థలు 360-డిగ్రీల సంపూర్ణ బీమా (Insurance) పాలసీలను అందజేస్తున్నాయి. ఇవి సీనియర్ సిటిజన్‌ల తక్షణ అవసరాలను తీర్చేలా ఉంటాయి. అంబులెన్స్ సేవలు, స్మార్ట్‌వాచ్ సహాయంతో ఫాల్ డిటెక్షన్ టెక్నాలజీ, ఇంట్లో నర్సింగ్ కేర్ వంటి అనేక కవరేజీలు అందుతాయి.

సరైన ఆరోగ్య బీమా పథకం ఉండడం అందరికీ చాలా అవసరం. ముఖ్యంగా మహిళలకు ఇది తప్పనిసరి. సరైన బీమా (Insurance) కవరేజీ ఉండడం వల్ల వారితో పాటు వారి కుటుంబం కూడా రక్షణతో ఉన్నట్లు మహిళలు భావిస్తారు. తద్వారా గౌరవప్రదమైన జీవితాన్ని సాగిస్తారు. మన కోసం, మన కుటుంబం కోసం నిరంతరం శ్రమిస్తున్న అమ్మ కోసం, ఆమె ఆరోగ్యం కోసం సరైన ఆరోగ్య బీమా పాలసీని ఈ మాతృదినోత్సం (Mother's Day) సందర్భంగా బహుమతిగా ఇద్దాం!

- తపన్‌ సింఘేల్‌, ఎండీ అండ్‌ సీఈఓ, బజాజ్‌ అలయన్జ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని