Rupay credit card: జీరో జాయినింగ్‌ ఫీజుతో ఇండస్‌ ఇండ్ - పూనావాలా ఫిన్‌కార్ప్‌ రూపే క్రెడిట్ కార్డు

Credit card: రూపే క్రెడిట్‌ కార్డ్‌ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన ఈ కార్డ్‌ వివరాలపై ఓ లుక్కేయండి.

Published : 29 May 2024 00:03 IST

RuPay credit card | ఇంటర్నెట్‌డెస్క్‌: డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా యూపీఐ (UPI)కి క్రెడిట్‌ కార్డులను అనుసంధానించే సదుపాయాన్ని ఆర్‌బీఐ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కేవలం రూపే (RuPay) క్రెడిట్‌ కార్డుకు మాత్రమే ఈ సదుపాయం ఉంది. దీంతో అనేక కార్డు జారీ సంస్థలు, బ్యాంకులు ఈ తరహా కార్డ్‌లను ఇటీవల ఎక్కువగా జారీ చేస్తున్నాయి. తాజాగా ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, పూనావాలా ఫిన్‌కార్ప్‌ లిమిటెడ్‌తో కలిపి eLITE రూపే ప్లాటినం క్రెడిట్ కార్డ్‌ను తీసుకొచ్చింది.

ఈ రూపే కార్డ్‌ను అన్నిరకాల యూపీఐ అప్లికేషన్లలో ఉపయోగించవచ్చు. ఎలాంటి జాయినింగ్‌ ఫీజు, వార్షిక రుసుములూ లేవు. ఎంపిక చేసిన ఇ- కామర్స్‌ లావాదేవీలపై ప్రతీ రూ.100కు 2.5 రివార్డ్‌ పాయింట్లు లభిస్తాయి. ప్రయాణ సంబంధిత బుకింగ్‌లు, యూపీఐ చెల్లింపులు, పాయింట్‌- ఆఫ్‌- సేల్‌ మెషీన్‌ (card machine) లావాదేవీలపై చేసే ప్రతీ 100 ఖర్చుపై 1 రివార్డ్‌ పాయింట్‌ లభిస్తుంది. ఇక ఎంపిక చేసిన వ్యాపార కొనుగోళ్లపై చేసే ప్రతీ రూ.100 లావాదేవీలపై 0.5 రివార్డ్‌ పాయింట్లు వస్తాయి. 

జూన్ 14 తర్వాత ఆ ఆధార్‌ కార్డులు పనిచేయవా? ఉడాయ్‌ వివరణ..

ఇంధన కొనుగోళ్లపై ఎలాంటి రివార్డు పాయింట్లు ఉండవు. సర్‌ఛార్జి నుంచి మినహాయింపు ఉంది. రివార్డు పాయింట్లు 24 నెలల వరకు చెల్లుబాటు అవుతాయి. క్రెడిట్‌ కార్డ్‌ జారీ చేసినప్పటినుంచి ఏడాదిలోగా రూ.4 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే 3,000 బోనస్‌ రివార్డ్‌ పాయింట్లు లభిస్తాయి. బుక్‌ మై షో ద్వారా కొనుగోలు చేసే సినిమా టికెట్లపై ఒకటి కొంటే మరికొటి ఉచితంగా పొందొచ్చు. రూ.200 కంటే ఎక్కువ మొత్తం పెట్టి టికెట్‌ కొనుగోలు చేస్తే నెలలో ఒక సినిమా టికెట్‌ను ఉచితంగా పొందొచ్చన్నమాట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని