Personal Loans: వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయ్‌?

ప్రస్తుతం అన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఎంతెంతో ఇక్కడ చూద్దాం...

Published : 21 Mar 2024 15:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వివిధ ఆర్థిక అవసరాల నిమిత్తం చాలా మంది వ్యక్తిగత రుణాల(Personal loan)ను తీసుకుంటారు. బ్యాంకులు కూడా మెరుగైన క్రెడిట్‌ స్కోరు (750+) గలవారికి సరసమైన వడ్డీ రేట్లకే ఈ రుణాలను ఇస్తున్నాయి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో కూడా వీటికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులు, పండుగ సందర్భాల్లో పరిమిత కాలానికి ప్రత్యేక వడ్డీ రేట్లను అందిస్తాయి. అటువంటి ఆఫర్లు అమల్లో ఉన్నప్పుడు రుణం కోసం దరఖాస్తు చేస్తే, తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని పొందొచ్చు. అయితే, రుణానికి దరఖాస్తు చేసే ముందు వివిధ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వసూలు చేసే వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లను, ప్రాసెసింగ్‌ ఫీజులను సరిపోల్చుకోవాలి.

వివిధ బ్యాంకులు వ్యక్తిగత రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను కింది పట్టికలో చూడండి..

గమనిక: ఈ పట్టికలో అత్యల్ప వడ్డీ రేట్లను మాత్రమే తెలిపాం. ప్రాసెసింగ్‌ ఫీజులు విడిగా ఉంటాయి, వాటి రుసుములు బ్యాంకును బట్టి మారతాయి. రుణ వడ్డీ రేట్లు..దరఖాస్తుదారుని క్రెడిట్‌ స్కోరు, తీసుకునే రుణ మొత్తం, నెలవారీ ఆదాయం, వృత్తి, బ్యాంకుతో సంబంధాలు మొదలైన వాటిపై ఆధారపడి ఉంటాయని గమనించాలి. మీకు వర్తించే రేటు కోసం బ్యాంకును సంప్రదించడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని