Car Loans: కారు రుణాలపై ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు ఎంతెంత?

దాదాపుగా అన్ని బ్యాంకులు వాహన రుణాలందిస్తున్నాయి. ఈ రుణాలకై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇక్కడ చూద్దాం.

Published : 29 Feb 2024 13:14 IST

భారత్‌లో కార్లు కొనేవారి సంఖ్య గత కొన్నేళ్లుగా బాగా పెరిగింది. 2024, జనవరి నెలలో దాదాపుగా 3.94 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. మధ్య తరగతి ప్రజల ఆదాయాలు గణనీయంగా పెరగడం, దాదాపుగా అన్ని బ్యాంకులు కార్ల కొనుగోలుకు విరివిగా రుణాలు ఇవ్వడం కూడా పెరుగుదలకు ముఖ్య కారణం. బ్యాంకులు క్రెడిట్‌ స్కోర్‌ 750, ఇంతకంటే ఎక్కువ ఉన్నవారికి తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు ఇస్తున్నాయి. చాలా బ్యాంకులు సాధార‌ణంగా కారు ఆన్‌-రోడ్ ధ‌ర‌లో 80%-90%వ‌ర‌కు మాత్ర‌మే రుణాన్ని మంజూరు చేస్తాయి. రుణాలు తీసుకునే ముందు వ‌డ్డీ రేట్ల‌తో పాటు, బ్యాంకు పాల‌సీల ప్ర‌కారం మారే ప్రాసెసింగ్ ఫీజులు, రీపేమెంట్ ఛార్జీలు మొద‌లైన ఇత‌ర ఛార్జీల గురించి తెలుసుకోవాలి.

కార్ల రుణాలపై కొన్ని ప్రముఖ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు కింది పట్టికలో చూడండి.

గ‌మ‌నిక: బ్యాంకులు తెలిపిన అత్య‌ల్ప వ‌డ్డీ రేట్లు మాత్ర‌మే ఇక్కడ తెలిపం. మీ లోన్ మొత్తం, క్రెడిట్ స్కోరు, వృత్తి, బ్యాంకు విధించే ఇత‌ర నిబంధ‌న‌లు, ష‌ర‌తులపై ఆధార‌ప‌డి మీకు వ‌ర్తించే వ‌డ్డీ రేటులో మార్పులుండొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని