ఐఫోన్‌ 15, శాంసంగ్‌ ఎం34 5జీ ఫోన్లపై డిస్కౌంట్‌

Eenadu icon
By Business News Team Published : 24 May 2024 00:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

iPhone- Samsung Galaxy | ఇంటర్నెట్‌డెస్క్‌: యాపిల్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ ఫోన్‌ ఐఫోన్‌ 15 (iPhone 15)పై ఆ కంపెనీ తగ్గింపును ప్రకటించింది. దీంతో పాటు ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ శాంసంగ్‌ కూడా తన గెలాక్సీ ఎం34 5జీ (Samsung Galaxy M34 5G)పై పెద్దఎత్తున డిస్కౌంట్‌ అందిస్తోంది. ప్రముఖ ఈ- కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ (Amazon)లో ఈ తగ్గింపు ధరలు కనిపిస్తున్నాయి.

ఐఫోన్‌ 15పై యాపిల్ 11 శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.79,900 ఉండగా.. తగ్గింపుతో రూ.71,290కే లభిస్తోంది. 6.1 అంగుళాల సూపర్‌ రెటినా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే, డైనమిక్‌ ఐలాండ్‌తో కూడిన కొత్త నాచ్‌ డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్‌లో వెనకవైపు 48 ఎంపీ కెమెరా ఇచ్చారు. ఏ16 బయోనిక్‌ చిప్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఉండే యూఎస్‌బీ-సీ పోర్ట్‌తో కూడిన ఛార్జింగ్‌ సదుపాయం ఉంది.

గో డిజిట్‌ లిస్టింగ్‌: విరుష్క జోడీకి జాక్‌పాట్‌.. పెట్టుబడి నాలుగింతలు

శాంసంగ్‌ తన గెలాక్సీ ఎం34 5జీపై గణనీయమైన డిస్కౌంట్‌ ప్రకటించింది. 6జీబీ+128జీబీ వేరియంట్‌ రూ.12,999కే లభిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.1,299 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ అదనం. అంటే ఈ మొబైల్‌ కేవలం రూ.11,700కే కొనుగోలు చేయొచ్చన్నమాట. లాంచ్‌ సమయంలో దీని ధరను కంపెనీ రూ.16,999గా పేర్కొంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13తో కూడిన వన్‌యూఐ 5తో వస్తోంది. 50 ఎంపీ ప్రధాన కెమెరా, ముందు వైపు సెల్ఫీల కోసం 13 ఎంపీ కెమెరా ఉంటుంది. 6000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు ఈ ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు