Vijayawada: జగన్‌పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్‌

సీఎం జగన్‌పై రాయిదాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

Published : 18 Apr 2024 19:18 IST

విజయవాడ: సీఎం జగన్‌పై రాయిదాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ కేసులో అనుమానితుడిని అరెస్టు చేసిన పోలీసులు గురువారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపర్చారు.  ఇరువర్గాల తరఫున కోర్టులో వాదనలు జరిగాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మైనర్‌ అని, అతనికి నేర చరిత్ర లేదని నిందితుడి తరఫు న్యాయవాది సలీం వాదించారు. రాయి విసిరితే హత్యాయత్నం కేసు పెడతారా? 307 సెక్షన్‌ ఈకేసులో వర్తించదని కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసులు ఇచ్చిన పుట్టిన తేదీ వివరాలు.. ఆధార్‌లో తేదీకి తేడా ఉందన్నారు. ఆధార్‌ కార్డులో పుట్టినతేదీని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయవాది సలీం కోరారు.

దురుద్దేశపూర్వకంగానే రాయితో సీఎంపై దాడి చేశారని, హత్యాయత్నం సెక్షన్‌ వర్తిస్తుందని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న కోర్టు.. పుట్టిన తేదీకి సంబంధించి మున్సిపల్‌ అధికారులు ఇచ్చిన ధ్రువపత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. నిందితుడికి మే 2వరకు రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని