వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు

భారత తొలి సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్‌’ శనివారం 3 గంటలు ఆలస్యంగా నడిచింది. ఈ నెల 3 శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళుతున్న రైలుపై ఖమ్మం రైల్వేస్టేషన్‌ దాటిన తర్వాత ముస్తఫానగర్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరడంతో సీ12 బోగీలో అద్దానికి పగుళ్లు వచ్చాయి.

Published : 05 Feb 2023 05:52 IST

అత్యవసర కిటికీ అద్దానికి పగుళ్లు
3 గంటలు ఆలస్యంగా రైలు

ఖమ్మం మామిళ్లగూడెం, విశాఖపట్నం(రైల్వేస్టేషన్‌) న్యూస్‌టుడే: భారత తొలి సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్‌’ శనివారం 3 గంటలు ఆలస్యంగా నడిచింది. ఈ నెల 3 శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళుతున్న రైలుపై ఖమ్మం రైల్వేస్టేషన్‌ దాటిన తర్వాత ముస్తఫానగర్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరడంతో సీ12 బోగీలో అద్దానికి పగుళ్లు వచ్చాయి. రాత్రి విశాఖ చేరిన తర్వాత వాల్తేర్‌లో రైల్వే అధికారులు కిటికీ అద్దం మార్చారు. దీనికి 3 గంటల సమయం పట్టడంతో శనివారం ఉదయం 5.45 గంటలకు బయలు దేరాల్సిన రైలును 8.50 గంటలకు వెళ్లేలా మార్పు చేశారు. దీంతో రైలు మూడు గంటలు ఆలస్యంగా నడిచింది. రైలుపై రాళ్లు విసిరిన ఘటనలో ముగ్గురు బాలురు ఉన్నట్లు గుర్తించామని ఖమ్మం ఆర్పీఎఫ్‌ సీఐ ఎం.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వారిలో ఇద్దరికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చి, లిఖితపూర్వకంగా బాండ్‌ తీసుకున్నట్లు తెలిపారు. ఏలూరు సమీపంలో సైతం నాలుగు రోజుల క్రితం ఇలానే జరిగిందని సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు