సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌.. కళ్లు మూసుకో అని చెప్పి కత్తితో పొడిచి చంపారు!

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో తన భార్యను వేధిస్తున్నాడనే కోపంతో ఓ వ్యక్తి స్నేహితుడిని హత్య చేశాడు.

Updated : 31 Mar 2023 09:27 IST

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో తన భార్యను వేధిస్తున్నాడనే కోపంతో ఓ వ్యక్తి స్నేహితుడిని హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాధారాలు లభించకుండా ఉండేందుకు శరీరాన్ని ముక్కలుగా చేసి చెత్తకుప్పలో పడేశాడు. బాపునగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసించే మహ్మద్‌ మీరజ్‌, మహ్మద్‌ ఇమ్రాన్‌ స్నేహితులు. ఇమ్రాన్‌ కోసం అతని ఇంటికి వెళ్లే మీరజ్‌.. మిత్రుడి భార్యను తరుచూ వేధించేవాడు. దీనిపై ఆగ్రహించిన ఇమ్రాన్‌ పలుమార్లు హెచ్చరించినా మీరజ్‌ తీరు మారకపోవడంతో అతణ్ని చంపాలని పథకం రచించాడు. దీని ప్రకారం మీరజ్‌ను ఇంటికి పిలిచి ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇస్తామంటూ కళ్లకు గంతలు కట్టి.. ఇమ్రాన్‌ దంపతులు ఇద్దరూ అతణ్ని కత్తితో పొడిచి చంపారు. తమ కుమారుడు కనిపించడం లేదన్న మీరజ్‌ తల్లిదండ్రుల ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. స్నేహితుడైన ఇమ్రాన్‌పై అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని