మట్టి తవ్వకాలపై ప్రశ్నించినందుకు దాడి.. ఆపై అట్రాసిటీ కేసు

ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న వైకాపా నాయకులను

Published : 13 Aug 2022 02:36 IST

కలుజువ్వలపాడు(తర్లుపాడు), న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న వైకాపా నాయకులను ప్రశ్నించిన స్థానికుడు కృష్ణారెడ్డిపై దాడి చేయడమే కాకుండా అట్రాసిటీ కేసు కూడా తాజాగా పెట్టారని తెలిసింది. కృష్ణారెడ్డిపై బుధవారం అర్ధరాత్రి ఇంటికి వెళ్లి రాడ్లతో దాడి చేయడంతో తలకు బలమైన గాయం అయిన విషయం తెలిసిందే. ఆయన  ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. అయితే వైకాపా నాయకులే తిరిగి దాడికి గురైన బాధితుడి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం గమనార్హం. ప్రశ్నించిన వ్యక్తిపై దాడి చేసిన కేసులో నిందితులపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారని స్థానిక ఎస్సై ముక్కంటిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. నిందితుల్లో ఒకరైన సామియేలు అనే వ్యక్తి  కృష్ణారెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టినట్లు తెలిపారు. దాడి కేసులో ఇరువురు ఘర్షణ పడినట్లు, 343 సెక్షన్‌  నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని