మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశాడు

తన వద్దకు చికిత్సకు వచ్చి మరణించిన వ్యక్తి మృతదేహాన్ని వైద్యుడు రహదారి పక్కన పడేశాడు. హరియాణాలోని గురుగ్రామ్‌లో  సెప్టెంబరు 26న ఈ ఘటన చోటుచేసుకుంది. లీలాధర్‌ అనే 20 ఏళ్ల యువకుడు జ్వరంతో బాధపడుతూ ఆర్‌ఎంపీ వైద్యుడు ఫహీమ్‌ వద్దకు వెళ్లాడు.

Published : 02 Oct 2022 04:59 IST

గురుగ్రామ్‌లో ఆర్‌ఎంపీ నిర్వాకం

తన వద్దకు చికిత్సకు వచ్చి మరణించిన వ్యక్తి మృతదేహాన్ని వైద్యుడు రహదారి పక్కన పడేశాడు. హరియాణాలోని గురుగ్రామ్‌లో  సెప్టెంబరు 26న ఈ ఘటన చోటుచేసుకుంది. లీలాధర్‌ అనే 20 ఏళ్ల యువకుడు జ్వరంతో బాధపడుతూ ఆర్‌ఎంపీ వైద్యుడు ఫహీమ్‌ వద్దకు వెళ్లాడు. వైద్యుడు చేసిన చికిత్స వల్ల లీలాధర్‌ ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా విషమించింది. అనంతరం బాధితుడు ప్రాణాలు విడిచాడు. దీంతో క్లినిక్‌ నడుపుతున్న ఫహీన్‌, సుభాన్‌.. యువకుడి మృతదేహాన్ని అర్ధరాత్రి వాహనంలో తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేశారు. ఆ దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. పోలీసులు ఫహీమ్‌ను అరెస్టుచేశారు.

పాదరక్షల్లో రూ.5 కోట్ల కొకైన్‌

పాదరక్షల్లో కొకైన్‌ ఉంచి అక్రమంగా తరలిస్తున్న ఓ మహిళను ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆమె పాదరక్షల నుంచి రూ.4.9 కోట్లు విలువ చేసే 490 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. మహిళ కదలికలపై అనుమానంతో విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. అనంతరం పాదరక్షలను తనిఖీ చేశారు. అందులో కొకైన్‌ను గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని