logo

25న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఈ నెల 25న ఉదయం 8 గంటలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు.

Published : 23 Apr 2024 18:04 IST

ఆదిలాబాద్ క్రీడావిభాగం: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఈ నెల 25న ఉదయం 8 గంటలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అడ్డి భోజారెడ్డి, పి.రాజేష్ తెలిపారు. అండర్-14, 16, 18, 20 ఏళ్ల విభాగం బాలబాలికలు, సీనియర్ మహిళలు, పురుషులకు వేరువేరుగా పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న క్రీడాకారులు తమ వయసు ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలన్నారు. జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులు ఈనెల 28 నుంచి సూర్యాపేటలో నిర్వహించే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని