logo

ఉత్సాహంగా పాఠశాల స్థాయి ఈత పోటీలు

జిల్లా కేంద్రంలోని ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన పాఠశాల స్థాయి ఈత పోటీలు ఉత్సాహంగా సాగాయి.

Published : 29 Apr 2024 19:57 IST

ఆదిలాబాద్ క్రీడావిభాగం: జిల్లా కేంద్రంలోని ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన పాఠశాల స్థాయి ఈత పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈత శిక్షకుడు కొమ్ము కృష్ణ ఆధ్వర్యంలో 5 నుంచి 16 ఏళ్లలోపు బాల, బాలికలు ఈ పోటీల్లో ఎంతో హుషారుగా పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు, క్రీడా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.  ప్రిన్సిపాల్ బిన్నీకౌర్ అహ్లువాలియా మాట్లాడుతూ చిన్నారుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ పోటీలు నిర్వహించామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని