logo

పదిలో 24వ స్థానం

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అనంతపురం జిల్లా వెనుకబడింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 24వ స్థానానికి పరిమితమైంది. 80.93 శాతం ఉత్తీర్ణత సాధించినా జిల్లాల వారీగా పరిశీలిస్తే చివరన ఉంది.

Published : 23 Apr 2024 04:52 IST

ఫలితాల్లో వెనుకబడిన జిల్లా
‘అనంత’ సంకల్పం అమలులో వైఫల్యం

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అనంతపురం జిల్లా వెనుకబడింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 24వ స్థానానికి పరిమితమైంది. 80.93 శాతం ఉత్తీర్ణత సాధించినా జిల్లాల వారీగా పరిశీలిస్తే చివరన ఉంది. గత సంవత్సరం 66.25 శాతం ఉత్తీర్ణత సాధించి... రాష్ట్రంలో 20వ స్థానంలో నిలిచింది. ఈసారి ఉత్తీర్ణతశాతం పెరిగినా జిల్లాల ర్యాంకులో వెనుకబడింది. రెగ్యులర్‌ విద్యార్థులు 30,893 మంది పరీక్షలకు హాజరయ్యారు.  ఉత్తీర్ణులైన వారిలో బాలురు 12,237 మంది, బాలికలు 12,766 మంది ఉన్నారు. బాలికలదే హవా సాగింది. 2021-22లో 49.70శాతంతో రాష్ట్రంలో చివరిస్థానంలో నిలిచింది. 2022-2023లో 20వ స్థానంలో ఉండగా.. ఈసారి 24వ స్థానానికి పరిమితం కావడం గమనార్హం.

  • వంద శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో చేపట్టిన ‘అనంత సంకల్పం’ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయకపోవడంతో ఉత్తీర్ణతలో జిల్లా అడుగున ఉన్నట్లు స్పష్టమవుతోంది. కార్యక్రమం ప్రకారం వంద రోజుల ప్రణాళిక అమలు చేయాల్సి ఉంటుంది. కానీ, 70 రోజులకే కుదించారు. నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలు వచ్చాయి.
  • అనంత సంకల్పం మెటీరియల్‌ ముద్రించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందే పాఠశాలలకు సరఫరా చేయాలి. డిసెంబరులో ఇవ్వాల్సి ఉన్నా జనవరి చివరలో విడుదల చేసి... ఫిబ్రవరి మూడో వారం వరకూ పంపిణీ చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని