logo

పుట్టగొడుగుల్లా అక్రమ లేఔట్లు

వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ  నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు. 

Published : 19 Apr 2024 04:51 IST

భూమార్పిడి లేని వైనం
చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు

మురారిలో జాతీయ రహదారి పక్కన అక్రమ లేఔట్‌

న్యూస్‌టుడే, గండేపల్లి: వైకాపా అధికారంలోకి వచ్చిన నుంచి గండేపల్లి మండలంలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆ పార్టీ  నాయకుల అండదండలతో కొన్ని లే ఔట్లను ఏర్పాటు చేసి అక్రమంగా మెరక చేశారు.  పలుకుబడి ఉపయోగించి భూమార్పిడి లేకుండానే పంట పొలాలను  పూడ్చేసి అక్రమ లేఔట్లు వేస్తున్నారు. ఇవన్నీ కళ్లెదుటే కనిపిస్తున్నా రెవెన్యూ అధికారులు కనీసం ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.   గతంలో మండలంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికి, ప్రస్తుత అధికారులు స్పందించడం లేదు.

జాతీయ రహదారికి పక్కనే..

అతి పొడవైన జాతీయ రహదారి గండేపల్లి మండలం జాతీయ రహదారి. రహదారికి ఇరువైపులా విలువైన పంటపొలాలు ఉన్నాయి. కొందరు వైకాపా నాయకులు ఆ పొలాలను మట్టితో పూడ్చేసి లేఔట్లుగా మార్చేశారు. మురారి, గండేపల్లి, మల్లేపల్లి, బొర్రంపాలెం, తాళ్లూరు, నీలాద్రిరావుపేట గ్రామాల్లోని రహదారిని అనుకుని ఉన్న పంటపొలాలను ఇలా మార్చేశారు  జగ్గంపేట నుంచి గోకవరం వెళ్లే దారిలోనూ  అక్రమ లేఔట్లు ఎక్కువగా ఉన్నాయి.

చూసీచూడనట్లు అధికారుల తీరు

ఈ వ్యవహారంపై కొందరు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మరికొందరు నాయకులకు వత్తాసు పలికే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భూమార్పిడి లేకుండా వేసిన అక్రమ లేఔట్లపై తహసీల్దారు చిరంజీవి వద్ద ప్రస్తావించగా వాటి వివరాలు లేవని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని