logo

ఇళ్లకు వెళ్లడం ఎలా?

సిద్ధం సభకు పలు జిల్లాల నుంచి వెయ్యికిపైగా బస్సులు ఏర్పాటుచేశారు. జనాన్ని తీసుకొచ్చినప్పుడు చూపిన శ్రద్ధ తిరుగు ప్రయాణంలో చూపకపోవడంతో సభ సాయంత్రం 6.30 గంటలకు ముగిసినా.. బస్సుల కోసం రాత్రి 10 గంటల వరకు నిరీక్షించాల్సి వచ్చింది.

Published : 20 Apr 2024 02:33 IST

సిద్ధం సభకు వచ్చినవారి పరిస్థితి 

ఈనాడు, కాకినాడ: సిద్ధం సభకు పలు జిల్లాల నుంచి వెయ్యికిపైగా బస్సులు ఏర్పాటుచేశారు. జనాన్ని తీసుకొచ్చినప్పుడు చూపిన శ్రద్ధ తిరుగు ప్రయాణంలో చూపకపోవడంతో సభ సాయంత్రం 6.30 గంటలకు ముగిసినా.. బస్సుల కోసం రాత్రి 10 గంటల వరకు నిరీక్షించాల్సి వచ్చింది. జనం రాని ప్రాంతాల్లో కొందరు పిల్లలను బస్సెక్కించి సభకు తీసుకొచ్చారు. సభాస్థలికి, బస్సుల పార్కింగ్‌ ప్రాంతానికి మూడున్నర కి.మీ. దూరం ఉంది. వేలాది వాహనాల ట్రాఫిక్‌ కారణంగా తిమ్మాపురం పంచాయతీ కాదంబరి లేవుట్‌లోని శివారు ప్రాంతాన్ని పార్కింగ్‌కు కేటాయించారు. తీసుకొచ్చినప్పుడు అచ్చంపేట కూడలిలో దించినా.. సభ ముగిసిన తర్వాత మూడున్నర కి.మీ. నడుచుకుని ప్రయాసపడుతూ బస్సుల దగ్గరకు చేరుకోవాల్సి వచ్చింది. గంటల తరబడి ఏడీబీ రోడ్డు కొత్తూరు కూడలిలో బస్సుల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. కొందరు తాము వచ్చిన బస్సులు గుర్తించలేక, అక్కడ తినడానికీ ఏమీ లేక నరకయాతన అనుభవించారు. బస్సు డ్రైవర్లతో మరికొందరు వాదనకు దిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని