logo

రాజీ పడదగిన కేసులు జాబితాను డీఎల్‌ఎస్‌ఏకు అందించాలి

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజీ పడదగిన కేసుల జాబితాను డీఎల్‌ఎస్‌ఏకు అందించాలని తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి పేర్కొన్నారు.

Published : 23 Apr 2024 05:13 IST

అధికారులతో మాట్లాడుతున్న న్యాయమూర్తి మాధురి

దానవాయిపేట (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజీ పడదగిన కేసుల జాబితాను డీఎల్‌ఎస్‌ఏకు అందించాలని తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలోని కార్యాలయంలో ఉమ్మడి జిల్లా రివెన్యూ, పంచాయతీ అధికారులతో న్యాయమూర్తి సమావేశమయ్యారు. మే 11న జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించేందకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సోమవారం బాధ్యతలు స్వీకరించిన డీఎల్‌ఎస్‌ఏ జిల్లా కార్యదర్శి కె.ప్రకాష్‌బాబు, పీపీ సీహెచ్‌వీ ప్రసాద్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని