logo

వంద పడకల ఆసుపత్రి.. శిలాఫలకంతో సరి

మాది పేదల ప్రభుత్వం.. వారి కోసం కుటుంబ వైద్యుడు, జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నామని వైకాపా నాయకులు ప్రగల్భాలు పలికారు. అత్యవసర సేవలను మాత్రం గాలికొదిలేశారు.

Published : 03 May 2024 03:37 IST

సామాజిక ఆసుపత్రి నిర్మాణానికి వేసిన శిలాఫలకం (పాతచిత్రం) 

మాది పేదల ప్రభుత్వం.. వారి కోసం కుటుంబ వైద్యుడు, జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నామని వైకాపా నాయకులు ప్రగల్భాలు పలికారు. అత్యవసర సేవలను మాత్రం గాలికొదిలేశారు. పెరుగుతున్న అవసరాల రీత్యా నిడదవోలు పట్టణంలోని సామాజిక ఆసుపత్రి స్థాయి పెంచాల్సిన అవసరం ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిడదవోలు వచ్చినప్పుడు 30 పడకల ఆసుపత్రిని వంద పడకల స్థాయికి పెంచేందుకు రూ.19 కోట్లు మంజూరు చేస్తున్నామని స్వయంగా ప్రకటించారు. నిధులు మంజూరయ్యాయంటూ ఫిబ్రవరి 22న ఎమ్మెల్యే శ్రీనివాస్‌నాయుడు హడావుడిగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత చేసింది ఏం లేదు. ప్రచార ఆర్భాటం కోసమే ఇదంతా చేశారనే విమర్శలు ఉన్నాయి.

న్యూస్‌టుడే, నిడదవోలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని