logo

నామినేషన్ల సందడి

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు.

Published : 23 Apr 2024 05:21 IST

 

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం సందడిగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లాలో 24, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 17,  కాకినాడ జిల్లాలో 14 నామినేషన్‌ దాఖలు చేశారు.

న్యూస్‌టుడే బృందం


నియోజకవర్గం: రాజానగరం

అభ్యర్థి: బత్తుల బలరామకృష్ణ

పార్టీ: జనసేన (ఎన్డీయే కూటమి అభ్యర్థి)
విద్యార్హతలు: 9వ తరగతి
కేసులు: 3
చరాస్తులు: రూ.19.80 కోట్లు
బంగారం: 2,363 గ్రాములు 
స్థిరాస్తుల విలువ మొత్తం:  రూ.22 కోట్లు
అప్పులు: రూ.11.54 కోట్లు


రాజమహేంద్రవరం పార్లమెంట్‌

అభ్యర్థి: డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌
పార్టీ : వైకాపా
విద్యార్హతలు: ఎంబీబీఎస్‌, డీఎల్‌వో(ఈఎన్‌టీ), ఎండీ, ఎఫ్‌సీసీపీ(యూఎస్‌ఏ)
కేసులు : ఏమీ లేవు
స్థిరాస్తి విలువ : రూ.14.20 కోట్లు
చరాస్తి విలువ : రూ.2.25 కోట్లు
వార్షిక ఆదాయం : రూ.97.83 లక్షలు (2022-2023లో)
అప్పులు: రూ.1.26 కోట్లు


నియోజకవర్గం:  పెద్దాపురం

అభ్యర్థి: నిమ్మకాయల చినరాజప్ప
పార్టీ: తెదేపా (ఎన్టీయే కూటమి అభ్యర్థి)
విద్యార్హతలు: ఎంఏ
కేసులు: 17 
చరాస్తులు: 400 గ్రాముల బంగారం విలువ రూ.26 లక్షలు, రూ.32 లక్షల విలువైన ఇన్నోవా క్రిస్టా కారు. చేతిలో నగదు రూ.1.20 లక్షలు. భార్య అనురాధకి 500 గ్రాములు బంగారం. విలువ రూ.32.50 లక్షలు, నగదు రూ. 30 వేలు. ః స్థిరాస్తులు: చినరాజప్ప పేరు మీద కాట్రేనికోనలో రూ.కోటి విలువైన 10 ఎకరాల భూమి. అమలాపురంలో రూ.19 లక్షల విలువైన 325 గజాల వాణిజ్య ప్రాంతంలోని ఖాళీ స్థలం, అమలాపురంలో 600 గజాల్లో నివాస భవనం.  పూర్వం నుంచి ఉన్న ఆస్తి విలువ రూ.కోటి. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి విలువ రూ.60 లక్షలు. భార్య పేరు మీద రూ.20 లక్షలు. 
అప్పులు:  రూ.17.25 లక్షలు, భార్య పేరు మీద రూ.74 వేలు


నియోజకవర్గం: తుని

అభ్యర్థి: యనమల దివ్య
పార్టీ: తెదేపా (ఎన్డీఏ కూటమి అభ్యర్థి) ః విద్యార్హతలు: బీటెక్‌, ఎంబీఏ
కేసులు: లేవు
చరాస్తుల విలువ: రూ. 96.03 లక్షలు
స్థిరాస్తుల విలువ: రూ.6.69 కోట్లు
బంగారం విలువ: రూ. 50 లక్షలు
అప్పులు: రూ.3 లక్షలు.


రాజమహేంద్రవరం పార్లమెంట్‌

అభ్యర్థి: గిడుగు రుద్రరాజు
పార్టీ: కాంగ్రెస్‌
విద్యార్హతలు: ఎల్‌ఎల్‌బీ
కేసులు:  ఒకటి
స్థిరాస్తుల విలువ: రూ.94 లక్షలు
చరాస్తులు: రూ.2.03 కోట్లు
వార్షిక ఆదాయం: రూ.9.37 లక్షలు
అప్పులు: రూ.78.(41 లక్షలు


నియోజకవర్గం: పిఠాపురం

అభ్యర్థి: వంగా గీత
పార్టీ: వైకాపా
విద్యార్హతలు: బీఏ, బీఎల్‌, ఎంఎల్‌
కేసులు: ఏమీ లేవు
చరాస్థులు:  అభ్యర్థి పేరు మీద రూ.2.10కోట్లు  భర్త పేరు..రూ.27.81 లక్షలు 
స్థిరాస్థులు:  అభ్యర్థి పేరు మీద రూ.13.11కోట్లు  భర్త పేరు: రూ.13.64కోట్లు
అప్పులు:  అభ్యర్థి పేరు మీద  రూ. 4.51కోట్లు  భర్త పేరు: రూ.51.64లక్షలు.


నియోజకవర్గం: రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైకాపా తరఫున మార్గాని భరత్‌రామ్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేయగా, ఆయన తరఫున తండ్రి మార్గాని నాగేశ్వరరావు మరొక సెట్టు నామినేషన్‌ వేశారు. రిటర్నింగ్‌ అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ దినేష్‌కుమార్‌ దరఖాస్తులను సీˆ్వకరించారు. భరత్‌ బీసీఏ చదివినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
అధికారికి నామపత్రం అందిస్తున్న బత్తుల బలరామకృష్ణ
ఆర్వో మాధవీలతకు నామపత్రాలు
అందజేస్తున్న గూడూరి శ్రీనివాస్‌
పెద్దాపురం ఈఆర్వో సీతారామారావుకు నామినేషన్‌ పత్రాలు అందిస్తున్న ఎమ్మెల్యే చినరాజప్ప
ఈఆర్వో రామలక్ష్మికి నామినేషన్‌ పత్రాలు అందిస్తున్న యనమల దివ్య

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని