logo

తాంబూలం అధరహో..!

పదేళ్ల తరువాత తమలపాకు రైతులకు గిట్టుబాటు ధర దక్కుతోంది. బుట్ట (2400 ఆకులు)  నాలుగు నెలలుగా రూ.800 నుంచి రూ.1000 వరకు పలుకుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి, ఆచంట మండలాల్లోని గోదావరి మధ్య లంకల్లో పండే తమలపాకు

Updated : 20 May 2022 06:09 IST

తమలపాకు బుట్ట ధర రూ.800 పైమాటే


తమలపాకు బుట్టలు ఎగుమతి చేస్తున్న కూలీలు

పాలకొల్లు, న్యూస్‌టుడే: పదేళ్ల తరువాత తమలపాకు రైతులకు గిట్టుబాటు ధర దక్కుతోంది. బుట్ట (2400 ఆకులు)  నాలుగు నెలలుగా రూ.800 నుంచి రూ.1000 వరకు పలుకుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి, ఆచంట మండలాల్లోని గోదావరి మధ్య లంకల్లో పండే తమలపాకు పశ్చిమకే ప్రత్యేకంగా నిలుస్తోంది. సుమారు 50 ఎకరాల్లో సాగులో ఉంది. ఇక్కడి నుంచి నిత్యం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. పూజలకే గాదు కర్ణాటక, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో నోరు పండే కిళ్లీలు కట్టేందుకు పశ్చిమ తమలపాకులకు ప్రాధాన్యం ఇస్తారు.
రెండేళ్ల పాటు దిగుబడి 
కొబ్బరి తోటల్లో అంతర పంటగా వేసే తమలపాకు ఒకసారి వేస్తే రెండేళ్లపాటు దిగుబడి వస్తుంది. ఎకరాకు రూ.3 లక్షలకు పైగా పెట్టుబడి అవుతుంది. ఈ నేపథ్యంలో గిట్టుబాటు ధర ఉంటేనే గట్టెక్కుతామని యలమంచిలి మండలం దొడ్డిపట్లకు చెందిన రైతు వర్ధినీడి శ్రీనివాస్‌ తెలిపారు. పాలకొల్లు రైల్వే స్టేషన్‌ నుంచి నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌లో నిత్యం 300 నుంచి 500 బుట్టలు ఎగుమతులు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని