logo

మేనుపై సృజన.. భావాల ఖజానా!

శరీరాన్నే(చర్మం) కాన్వాస్‌గా మలచుకొని..దేవతలు, చరిత్రలో నిలిచిన వీర వనితలు, పురాతన కథల్ల్లోని స్త్రీ పాత్రలనే స్ఫూర్తిగా తీసుకుని సృజించిన చిత్రఖండాల ప్రదర్శన అది

Updated : 25 Jun 2022 04:36 IST

 ఫెమినైన్‌ చిత్ర కళా ప్రదర్శన ప్రారంభం

అభిజ్ఞతో కలిసి ప్రదర్శనను తిలకిస్తున్న రామోజీ ఫిల్మ్‌ సిటీ ఎండీ విజయేశ్వరి

రాయదుర్గం, న్యూస్‌టుడే: శరీరాన్నే(చర్మం) కాన్వాస్‌గా మలచుకొని..దేవతలు, చరిత్రలో నిలిచిన వీర వనితలు, పురాతన కథల్ల్లోని స్త్రీ పాత్రలనే స్ఫూర్తిగా తీసుకుని సృజించిన చిత్రఖండాల ప్రదర్శన అది.. నగరానికి చెందిన అమెరికాలో ఉంటున్న ఎన్‌ఆర్‌ఐ చిత్ర కళాకారిణి అభిజ్ఞ సృజించిన అద్భుత చిత్ర కళాఖండ ప్రదర్శనను ది ఫెమినైన్‌ పేరుతో ఖాజాగూడలోని మా లక్ష్మి కోర్డు యార్డ్‌ భవనంలో ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు జరగనున్న ప్రదర్శనను శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, రామోజీ ఫిల్మ్‌ సిటీ ఎండీ విజయేశ్వరి, జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌, పరకాల ప్రభాకర్‌ తదితరులు ప్రదర్శనను తిలకించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని