logo

నష్టపరిహారం కోసం.. ప్రగతిభవన్‌ వద్ద కుటుంబం ఆత్మహత్యా యత్నం

ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తమ భూమికి నష్టపరిహారం చెల్లించడం లేదంటూ ఓ వ్యక్తి కుటుంబంతో సహా ప్రగతిభవన్‌ వద్ద సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Published : 31 Jan 2023 04:10 IST

పంజాగుట్ట, న్యూస్‌టుడే: ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తమ భూమికి నష్టపరిహారం చెల్లించడం లేదంటూ ఓ వ్యక్తి కుటుంబంతో సహా ప్రగతిభవన్‌ వద్ద సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్పందించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ఐలేష్‌ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం ఇటీవల తనకు చెందిన అయిదెకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దానికి సంబంధించిన నష్టపరిహారం ఇంతవరకు చెల్లించలేదు. దీంతో మనస్తాపం చెందిన ఐలేష్‌.. తన భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులతో సోమవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌ వద్దకు వచ్చారు. వారు తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై చల్లుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా.. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. అనంతరం పంజాగుట్ట పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఐలేష్‌, ఆయన కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి ఇంటికి పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని