logo

ప్రాథమిక పరిశుభ్రతపై పిల్లలకు వర్క్‌షాప్‌

రోగాల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు ప్రాథమిక పరిశుభ్రతను పాటించాలని సెసేమ్ ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సోనాలి ఖాన్ సూచించారు.

Published : 02 Apr 2023 14:43 IST

*సెసేమ్ ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సోనాలి ఖాన్

హైదరాబాద్: రోగాల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు ప్రాథమిక పరిశుభ్రతను పాటించాలని సెసేమ్ ఇండియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సోనాలి ఖాన్ సూచించారు. సెసేమ్ వర్క్‌షాప్-ఇండియా, సెసేమ్ వర్క్‌షాప్‌ భారతీయ విభాగం, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన నాన్ ప్రాఫిట్ మీడియా ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ హైజీన్ అండ్ బిహేవియర్ ఛేంజ్‌ కోయలిషన్ (HBCC)తో కలిసి ప్రజలలో ‘చేతి పరిశుభ్రత- వ్యాధుల నివారణ’ గురించి అవగాహన కల్పించడానికి ఈ వర్క్ షాప్‌ను నిర్వహించారు. పిల్లలు, కుటుంబాలలో పరిశుభ్రత జ్ఞానం ప్రోత్సహించడం, అభివృద్ధి అవసరాలను తీర్చడం తమ లక్ష్యమన్నారు. ఎప్పటి నుంచో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నా,  కొవిడ్‌-19 మహమ్మారితో దాని ఆవశ్యకత మరింత ఏర్పడిందన్నారు. ప్రముఖ ముప్పెట్స్ ఎల్మో, చమ్కీలు పిల్లలకు తమ సరదా చర్యలతో వినోదాన్ని పంచుతూ వర్క్‌షాప్‌లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ మల్టీమీడియా ప్రచారంలో భాగంగా, సెసేమ్ వర్క్‌షాప్ ఇండియా హిందీ, మరాఠీ, తెలుగు, తమిళ భాషలలో వీడియోలు, పోస్టర్‌లతో సహా ‘చేతి పరిశుభ్రత- వ్యాధి నివారణ చర్యలు’ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి సరళమైన, ఇంకా ఆకర్షణీయమైన ఆన్‌లైన్ కంటెంట్‌ను అందించింది. డిజిటల్ గేమ్స్ మరియు ఇ-బుక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, రేడియో వంటి సోషల్ మీడియా సైట్‌ల ద్వారా, అలాగే కమ్యూనిటీలతో ప్రత్యక్ష పరిచయం ద్వారా ఈ మెటీరియల్స్ కుటుంబాలకు అందిస్తున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని