logo

బెట్టింగ్‌ కోసం వృద్ధురాలిని హతమార్చిన యువకుడు

ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కి పాల్పడిన యువకుడు.. వృద్ధురాలిని హతమార్చి పరారయ్యాడు. చివరికి చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన ఆదిభట్ల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.

Published : 28 Apr 2024 03:02 IST

పోలీసులకు చిక్కి జైలుË పాలు

వివరాలు వెల్లడిస్తున్న మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, చిత్రంలో ఏసీపీ కేపీవీ రాజు, సీఐ రాఘవేందర్‌రెడ్డి

ఆదిభట్ల, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కి పాల్పడిన యువకుడు.. వృద్ధురాలిని హతమార్చి పరారయ్యాడు. చివరికి చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన ఆదిభట్ల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు..నాదర్‌గుల్‌లో ఉండే కళావతి(72) తన పొలంలో ఒంటరిగా నివసిస్తోంది. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు నగరంలో స్థిరపడ్డారు. తరచూ వచ్చి తల్లిని చూస్తూ ఉంటారు. కొంపల్లిలో ఉండే చిన్న కూతురు రజని దగ్గర కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న రత్న అశోక్‌రెడ్డి(32) ఓ యాప్‌ ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌కి పాల్పడి ఏడు నెలలుగా డబ్బులు పోగొట్టుకున్నాడు. యాప్‌ ద్వారా లోన్లు తీసుకొని అప్పులపాలయ్యాడు. రజని కుటుంబంతో తరచూ కళావతి ఉండే నివాసానికి అశోక్‌రెడ్డి వచ్చేవాడు.ఒంటరిగా ఉన్న కళావతిని చంపి ఒంటిపై ఉన్న బంగారం తీసుకుందామని 2 నెలల క్రితం అనుకున్నాడు. ఈనెల 17న కళావతి ఇంటికి వెళ్లాడు. ఆమె చెప్పిన పనులన్నీ చేసి అక్కడే రాత్రి అన్నం తిన్నాడు. 9.30కు బెకుపై బయటకు వెళ్లి పరిసరాలను పరిశీలించాడు. ఎవరూ లేకపోవడంతో తిరిగి వచ్చి ఆమెను బెడ్‌షీట్‌తో ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. 6 బంగారు గాజులు తీసుకొని పరారయ్యాడు. అనుమానం రాకుండా గొలుసు, చెవి కమ్మలు వదిలేశాడు. మర్నాడు తల్లి మృతిపై కుమారుడు రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాల్లో అశోక్‌రెడ్డి కనిపించడంతో ఆరా తీశారు. తానే చంపానని చోరీ చేసిన గాజులను అమీర్‌పేటలో ఓ కంపెనీలో అమ్మేసి రూ.3.96 లక్షలు తీసుకున్నట్లు అశోక్‌రెడ్డి అంగీకరించాడని, అతన్ని రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని