logo

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట మోసం

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట నలుగురి నుంచి రూ.65,36,590 మేర కొల్లగొట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఎస్సార్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలిపారు.

Published : 29 Apr 2024 04:09 IST

అమీర్‌పేట, న్యూస్‌టుడే: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరిట నలుగురి నుంచి రూ.65,36,590 మేర కొల్లగొట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఎస్సార్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలిపారు. ఎస్సార్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని బీకేగూడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి బి.విశాల్‌రాజ్‌ జకారియాస్‌తో పాటు ఎం.శ్రీకాంత్‌, పరుచూరి రామయ్య, నవజీవన్‌లు సికింద్రాబాద్‌లోని యూనియన్‌ ఆఫ్‌ ఇవాంజలికల్‌ స్టూడెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (యూఈఎస్‌ఐ)లో సభ్యులు. వీరికి 2018లో అంగూరి ప్రకాష్‌కుమార్‌ (54) పరిచయమయ్యాడు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే రెండేళ్లలో 248 శాతం డబ్బు తిరిగి వస్తుందంటూ నమ్మించాడు. పెట్టుబడి పెట్టేందుకు ఓ వెబ్‌సైట్‌ గురించి చెప్పాడు. తన అనుచరులుగా మరో 12 మందిని పరిచయం చేశాడు. నమ్మిన బాధితులు దశల వారీగా మొత్తం రూ.65,36,590 పెట్టుబడిగా పెట్టారు. ఆ తరువాత ఎంతకూ రిటర్న్స్‌ రాకపోవడంతో పాటు విషయం కోసం బాధితులు ఆరా తీయడంతో నిందితుడు ప్రకాష్‌కుమార్‌ మొహం చాటేసేవాడు. చివరకు వెబ్‌సైట్‌ గురించి తెలుసుకుంటే అది నకిలీదని, నిందితుడే దాన్ని తయారుచేశాడని తెలుసుకున్నారు. బాధితులు నగర సీసీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. ఈ నెల 22న జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీసీఎల్‌ పోలీసులు కేసును ఎస్సార్‌నగర్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని