logo

పెరిగిన ఓటర్లు.. 8,758

కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓటర్లు పెరిగారు. ఫిబ్రవరి నెల 8వ తేదీన విడుదలైన ఓటరు ముసాయిదా తుది జాబితాతో పోలిస్తే ప్రస్తుతం ఓటు వేసే వారి సంఖ్య పెరిగింది.

Published : 28 Apr 2024 05:46 IST

ఈనాడు, కరీంనగర్‌ : కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓటర్లు పెరిగారు. ఫిబ్రవరి నెల 8వ తేదీన విడుదలైన ఓటరు ముసాయిదా తుది జాబితాతో పోలిస్తే ప్రస్తుతం ఓటు వేసే వారి సంఖ్య పెరిగింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో ఇటీవల కొత్తగా ఓటు నమోదు చేసుకోవడంతోపాటు అనర్హుల ఏరివేత ప్రక్రియను అధికారులు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పోలింగ్‌ బూత్‌ స్థాయి అధికారుల పర్యవేక్షణలు మార్పులు, చేర్పుల ప్రక్రియ కొనసాగింది. ఇక అందివచ్చిన అవకాశాన్ని కొత్త ఓటర్లు అందుకున్నారు. 18 ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తంగా 8,758 ఓట్లు పెరగడం గమనార్హం. ఇదే సమయంలో ఆయా నియోజకవర్గాల పరిధిలో డబుల్‌ ఓటర్లు సహా ఇతర అనర్హులవి జాబితా నుంచి తొలగించారు. వీటితోపాటు గ్రామాల్లో, పట్టణాల్లో మరణించిన వారి వివరాలను తీసుకుని వాటిని కూడా జాబితా నుంచి తీసేశారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఇలా మొత్తంగా 15,399 మందివి తొలగించారు. ఇవి పోనూ కొత్తగా 24,097 మంది కొత్త ఓటర్లు పుట్టుకొచ్చారు. వీరంతా ఈ ఎన్నికల్లో తొలి ఓటును వినియోగించుకోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని