logo

బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు.

Published : 19 Apr 2024 02:53 IST

సత్తుపల్లి, న్యూస్‌టుడే: ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. ఆలయ చుట్టు పక్కల దుకాణ సముదాయాల ఏర్పాటుకు అన్ని పనులను పూర్తి చేశారు. ఈనెల 19న మైలపట్నం, పుట్టబంగారం కార్యక్రమాలతోపాటు 20న జల బిందెలు, పూల కప్పెర, 21న రెడకప్పెర, 22న గ్రామ ప్రభబండి ఊరేగింపు, 23న గండ దీపాలు, అగ్నిగుండ ప్రవేశం, పెద్దతిరునాలను నిర్వహించనున్నారు. 24న బద్దెగొర్రె, చంద్రపట్నం, అదే రోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి తిరునాళ్లను ముగించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని