logo

రామయ్యకు బంగారు తులసీ దళార్చన

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం భక్తులు పోటెత్తారు. క్యూలైన్లతో పాటు ప్రసాదాల కౌంటర్లు కిటకిటలాడాయి. పసిడితో తయారు చేసిన తులసీ దళాలను సీతారాముడి పాదాల చెంత ఉంచి అర్చన చేశారు.

Updated : 19 May 2024 05:40 IST

రూ.లక్ష విరాళం అందిస్తున్న భక్తులు 

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం భక్తులు పోటెత్తారు. క్యూలైన్లతో పాటు ప్రసాదాల కౌంటర్లు కిటకిటలాడాయి. పసిడితో తయారు చేసిన తులసీ దళాలను సీతారాముడి పాదాల చెంత ఉంచి అర్చన చేశారు. సీతమ్మకు యోక్త్రధారణ రామయ్యకు యజ్ఞోపవీత ధారణ నిర్వహించారు. మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక, దర్బారు సేవ తన్మయత్వాన్ని నింపాయి. సత్తుపల్లి మండలం రేచర్లకు చెందిన కె.రాఘవరెడ్డి అనే భక్తుడు కుటుంబ సభ్యులతో వచ్చి రామయ్యను దర్శించుకున్నారు. అన్నదానం నిమిత్తం రూ.1,01,116 విరాళాన్ని పీఆర్వో సాయిబాబా ద్వారా రాములవారి ఖాతాకు జమ చేశారు. దాతలకు వైదిక పెద్దలు హనుమత్‌శాస్త్రి, గోపాలకృష్ణమాచార్యులు ఆశీర్వచనం అందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని