logo

రానున్న ఐదురోజులు వడగాల్పులు: కలెక్టరు హెచ్చరిక

రానున్న ఐదు రోజులు నారాయణపేట జిల్లాలో తీవ్రమైన వడగాల్పులతో పాటు ఉష్ణ్రోగ్రతలు రికార్డు స్థాయిలో 45డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష కోరారు.

Published : 28 Apr 2024 05:05 IST

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

నారాయణపేట(పాతబస్టాండ్‌), న్యూస్‌టుడే : రానున్న ఐదు రోజులు నారాయణపేట జిల్లాలో తీవ్రమైన వడగాల్పులతో పాటు ఉష్ణ్రోగ్రతలు రికార్డు స్థాయిలో 45డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష కోరారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. బయటకు తప్పనిసరై రావాల్సి ఉంటే తలకు టోపీలు, రూమాలు, గొడుగులు వినియోగించాలన్నారు. రోజూ కనీసం ఐదు లీటర్ల మంచినీరు తాగాలని సూచించారు. నలుపు, ముదురు రంగు, మందంగా ఉండే దుస్తులు ధరించాలన్నారు  కాఫీ, టీలు వేడి వాతావరణంలో తాగడం తగ్గిస్తే మేలని కలెక్టరు అభిప్రాయపడ్డారు. మజ్జిగ, కొబ్బరినీళ్లు తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని కలెక్టరు శ్రీహర్ష అన్నారు. ఎవరైన వడదెబ్బకు గురైతే శరీరాన్ని చల్లని తడిగుడ్డతో శరీర ఉష్ణోగ్రత 101డిగ్రీల కంటే తక్కువ స్థాయికి వచ్చే వరకు తుడుస్తూ ఉండాలన్నారు. సమీప ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించాలని కోరారు. వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స కిట్లుతో ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టరు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని