logo

ముగిసిన శిర్సనగండ్ల రాములోరి బ్రహ్మోత్సవాలు

రెండో భద్రాదిగా పేరొందిన చారకొండ మండలం శిర్సనగండ్ల శ్రీసీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా ముగిసాయి.

Published : 29 Apr 2024 05:09 IST

ఉత్సవ విగ్రహాలను పల్లకీలో తీసుకెళ్తున్న భక్తులు

చారకొండ (వెల్దండ గ్రామీణం), న్యూస్‌టుడే : రెండో భద్రాదిగా పేరొందిన చారకొండ మండలం శిర్సనగండ్ల శ్రీసీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా ముగిసాయి. ఈనెల 16 నుంచి శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీసీతారామచంద్రస్వామి మాస కల్యాణోత్సవంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 22 వరకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు కొనసాగాయి. ఆలయ పరిసరాలు శ్రీరామనామస్మరణతో మార్మోగింది. ఉత్సవాల్లో వివిధ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీసీతారామచంద్రస్వాములను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల్లో చివరి రోజు శ్రీసీతారామచంద్రస్వాములను ప్రత్యేక అర్చనలు, పూజల అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి ఊరేగింపుగా శిర్సనగండ్లలోని శ్రీఆంజనేయస్వామి ఆలయానికి తరలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్‌ ఢేరం రామశర్మ, ఈవో శ్రీనివాస్‌రెడ్డి, మేనేజర్‌ నిరంజన్‌, ప్రధాన అర్చకులు లక్ష్మణశర్మ, మురళీధర్‌శర్మ, సీతారామశర్మ, వేణుశర్మ, ప్రవీణ్‌శర్మ, ఆనంద్‌శర్మ, కోదండరామశర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని