logo

23న మల్లన్నసాగర్‌ జలాశయ ప్రారంభోత్సవం

జిల్లాలోని తొగుట మండల పరిధిలో నిర్మించిన కొమురవెల్లి మల్లన్నసాగర్‌ జలాశయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 23న ప్రారంభించనున్నట్లు మెదక్‌ ఎంపీ....

Published : 16 Feb 2022 01:40 IST

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి వెల్లడి

ఈనాడు డిజిటల్‌, సిద్దిపేట: జిల్లాలోని తొగుట మండల పరిధిలో నిర్మించిన కొమురవెల్లి మల్లన్నసాగర్‌ జలాశయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 23న ప్రారంభించనున్నట్లు మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన విషయం తెలిసిందే. గతేడాది ఆగస్టు 7న తొగుట మండలం తుక్కాపూర్‌ వద్ద నిర్మించిన పంప్‌హౌజ్‌ నుంచి మూడు మోటార్ల ద్వారా గోదావరి జలాలను ప్రయోగాత్మక పరిశీలనలో భాగంగా కాళేశ్వరం తాత్కాలిక కాలువలోకి విడుదల చేశారు. అక్కడి నుంచి మల్లన్నసాగర్‌లోకి నీటిని మళ్లించారు. తరువాత ఆగస్టు 22 నుంచి 28 వరకు ఎనిమిది మోటార్ల ద్వారా 4.3 టీఎంసీలను తరలించారు. కొద్దిరోజుల విరామం అనంతరం సెప్టెంబరు 17 నుంచి నీటి విడుదలను కొనసాగించి.. మరో ఆరు టీఎంసీలను మల్లన్నసాగర్‌లోకి పంపారు. మొత్తంగా ప్రస్తుతం 12 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని