logo

‘పద్య మాధుర్యం అద్భుతమైనది’

తెలుగు భాషకు పద్యం మకుటం వంటిదని ప్రముఖ శతావధాని గౌరీభట్ల మెట్రామశర్మ అన్నారు. శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో కేవీ రాఘవాచార్య స్మారక సాహిత్య పీఠం తెలుగు విభాగం ఆధ్వర్యంలో

Published : 21 May 2022 01:26 IST

కార్యశాలలో మాట్లాడుతున్న శతావధాని మెట్రామశర్మ

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: తెలుగు భాషకు పద్యం మకుటం వంటిదని ప్రముఖ శతావధాని గౌరీభట్ల మెట్రామశర్మ అన్నారు. శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో కేవీ రాఘవాచార్య స్మారక సాహిత్య పీఠం తెలుగు విభాగం ఆధ్వర్యంలో పద్యరచణపై ఒక రోజు నైపుణ్యాభివృద్ధి కార్యశాల నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మెట్రామశర్మ మాట్లాడుతూ.. పద్యమాధుర్యం అద్భుతమైనదని, అలంకారంతో కూడుకున్నదని తెలిపారు. పద్యానికి తెలంగాణ పుట్టినిల్లన్నారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడారు. విద్యార్థులకు పద్యరచనపై మెలకువలు నేర్పాలనే ఉద్దేశంతోనే కార్యశాల నిర్వహిస్తున్నామని చెప్పారు. కన్వీనర్‌ మహేందర్‌, శంకరాభరణం పద్యపీఠం నిర్వాహకులు కంది శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

అసమానతలు రూపుమాపితేనే అభివృద్ధి
దేశానికి సాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇంకా పలు చోట్ల అసమానతలు నెలకొన్నాయని, దీన్ని రూపుమాపితేనే అభివృద్ధి సాధ్యమని కొచ్చిన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యులు అరుణాచలం అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ‘అమృత్‌ కాల్‌లో భాగంగా భారతదేశం ఆర్థిక వ్యవస్థ-సవాళ్లు’ అన్న అంశంపై జాతీయస్థాయి వెబినార్‌ నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథులుగా కొచ్చిన్‌ యూనివర్సిటీ ఆచార్యులు అరుణాచలం, దిల్లీ విశ్వవిద్యాలయం ఆచార్యులు అనిల్‌కుమార్‌ సింగ్‌లు హాజరై మాట్లాడారు. వివిధ ప్రణాళికలు రూపొందించుకొని పక్కాగా అమలు చేయడంతో దేశంలో పలు అంశాల్లో అభివృద్ధి సాధించిందని చెప్పారు. 37 శాతం పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాలకు సైతం పథకాలు చేరాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్‌ డా.సీహెచ్‌.ప్రసాద్‌, అధ్యాపకులు భవానీ, మల్లేశం, శ్రద్ధానందం తదితరులు పాల్గొన్నారు.

మెథడాలజీ టెక్నిక్స్‌పై కార్యశాల
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల బయోటెక్నాలజీ, బోటనీ విభాగాల సంయుక్తాధ్వర్యంలో మెథడాలజీ టెక్నిక్స్‌ అనే అంశంపై అంతర్జాతీయ కార్యశాల నిర్వహించారు. ఇంటర్‌నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ కెమికల్‌ టెక్నాలజీ శాస్తవేత్త రెడ్డిశెట్టి ప్రకాశం, సౌదీ అరేబియాకు చెందిన యువ శాస్తవేత్త డా.మీర్‌ నైమన్‌అలీ, జమ్ముకశ్మీర్‌కు చెందిన శాస్తవేత్త డా.శ్రీనివాస్‌లు పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు. మహారాష్ట, తమిళనాడు, కర్ణాటక, కశ్మీర్‌ రాష్టాలకు చెందిన పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని