logo

ఈవీఎం, వీవీప్యాట్‌లకు ఇదే తేడా..

ఎలక్టాన్రిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వీవీ ప్యాట్‌). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్‌ నంబరు దీనిపై కనిపిస్తాయి. అది కేవలం 7 సెకన్లు మాత్రమే ఉంటుంది.

Published : 23 Apr 2024 01:51 IST

న్యూస్‌టుడే, పాపన్నపేట: ఎలక్టాన్రిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వీవీ ప్యాట్‌). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్‌ నంబరు దీనిపై కనిపిస్తాయి. అది కేవలం 7 సెకన్లు మాత్రమే ఉంటుంది. తద్వారా ఎవరికి ఓటు వేశామో చూసుకోవచ్చు. దీంతో పాటు ఈవీఎంలో కంట్రోల్‌, బ్యాలెట్‌ యూనిట్లు ఉంటాయి. కంట్రోల్‌ యూనిట్‌ పోలింగ్‌ అధికారి వద్ద, బ్యాలెట్‌ యూనిట్‌, వీవీ ప్యాట్‌ ఓటేసే చోట బిగిస్తారు. పోలింగ్‌ అధికారి సీయూను యాక్టివేట్‌ చేస్తేనే ఓటేసే అవకాశం ఉంటుంది. తొలిసారిగా 2013లో జరిగిన నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వీవీ ప్యాట్‌ విధానాన్ని ఎన్నికల సంఘం అమల్లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత దశల వారీగా అన్ని ఎన్నికల్లోనూ ప్రవేశపెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని