logo

ఇళ్లంతా నిల్వ.. ఒళ్లంతా దురద

మార్కెట్‌లో మంచి ధర లభించక పోవడంతో రైతులు ఇంట్లోనే పత్తిని నిల్వ చేస్తున్నారు. నెలల తరబడి నిల్వ చేయడంతో వాటి నుంచి వచ్చే దుమ్ము, ధూళిని పీల్చడం వల్ల దగ్గు, తుమ్ములతో వ్యాధుల బారిన పడుతున్నారు.

Published : 27 Jan 2023 06:01 IST

పత్తిని ఇంట్లో నిల్వ చేయడం వలన ఒంటిపై ఏర్పడ్డ దద్దుర్లు

చండూరు, న్యూస్‌టుడే: మార్కెట్‌లో మంచి ధర లభించక పోవడంతో రైతులు ఇంట్లోనే పత్తిని నిల్వ చేస్తున్నారు. నెలల తరబడి నిల్వ చేయడంతో వాటి నుంచి వచ్చే దుమ్ము, ధూళిని పీల్చడం వల్ల దగ్గు, తుమ్ములతో వ్యాధుల బారిన పడుతున్నారు. పత్తిలో నల్లటి పురుగులు చేరి, దానిని తాకగానే దురద, దద్దుర్లు, ఒళ్లంతా మచ్చలు ఏర్పడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


తెచ్చిన అప్పులు తీరేదేలా
- కర్నాటి మహేశ్‌, శిర్ధేపల్లి

నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. మరో అయిదు ఎకరాలు ·కౌలు తీసుకుని పత్తి సాగు చేశాను. పెట్టుబడి కోసం వడ్డీకి అప్పు తెచ్చాను. ఎకరాకు 4-5 క్వింటాలు దిగుబడి వచ్చింది. ఇప్పుడున్న ధరకు విక్రయిస్తే వడ్డీకి తెచ్చిన అప్పు తీరదు. రెండు నెలలుగా పత్తిని ఇంట్లోనే నిల్వ చేయడంతో చిన్న చిన్న పురుగులు ఉండి.. తాకగానే దురద వస్తోంది.


ఇంట్లో ఉండలేక పోతున్నాం
- దామెర యాదయ్య  

నేను రెండు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. పత్తిని ఇంట్లోనే నిల్వ ఉంచడంతో కుటుంబ సభ్యులందరికీ ఒళ్లంతా దద్దుర్లు వచ్చాయి. ఇంట్లో ఉండలేకపోతున్నాం.


పత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలి
డా.కల్యాణ్‌ సుమన్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌,  ఎన్‌.సి.డి యాదాద్రి భువనగిరి జిల్లా

రైతులు పత్తిని నెలల తరబడి ఇంట్లో నిల్వ చేయడంతో దానిలో చిన్న పురుగులు చేరి చర్మంపై దద్దుర్లు, మచ్చలు ఏర్పడి చర్మ వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తాయి.  రైతులు సాధ్యమైనంత వరకు పత్తిని ఇంట్లో నిల్వ ఉంచకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని