logo

ఈవీఎంలకు 35 ఏళ్లు

ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల పాత్ర అత్యంత ముఖ్యం. ఈ యంత్రం తొలుత వినియోగం, పుట్టు పూర్వోత్తరాలను పరిశీలించినట్లైతే..

Published : 23 Apr 2024 02:44 IST

ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల పాత్ర అత్యంత ముఖ్యం. ఈ యంత్రం తొలుత వినియోగం, పుట్టు పూర్వోత్తరాలను పరిశీలించినట్లైతే.. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం)ను మొదటిసారి 1989లో ఎంపిక చేసిన కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మాత్రమే ప్రయోగాత్మకంగా వినియోగించారు. తదుపరి మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, దిల్లీ రాష్ట్రాల్లోని 25 నియోజకవర్గాల్లో ఈవీఎంల ఆధారంగా పోలింగ్‌ జరిగింది. ఈవీఎంల ప్రయోగం సత్ఫలితాలివ్వడంతో 2001లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో వాడారు. 2004లో దేశవ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో వినియోగించారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేస్తుండటంతో 2018 నుంచి ఓటు ఎవరికి వేశారో తెలుసుకునేందుకు వీవీప్యాట్‌ యంత్రాలను వాడుతుండటం గమనార్హం. అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకుంటే నన్‌ ఆఫ్‌ ది అబోవ్‌ (నోటా)ను ఎంచుకునే అవకాశాన్ని 2013లో ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది.

న్యూస్‌టుడే, రాజపేట, నడిగూడెం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని