logo

అభ్యర్థులిద్దరూ ‘బీఎన్‌ రెడ్డి’లే..!

మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గంలో 1989, 1991 ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులిద్దరూ బీఎన్‌రెడ్డిలే. ఒకరు వాస్తుశిల్పి బద్దం నర్సింహారెడ్డి. మరొకరు భీంరెడ్డి నర్సింహారెడ్డి.

Published : 24 Apr 2024 02:19 IST

చౌటుప్పల్‌: మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గంలో 1989, 1991 ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులిద్దరూ బీఎన్‌రెడ్డిలే. ఒకరు వాస్తుశిల్పి బద్దం నర్సింహారెడ్డి. మరొకరు భీంరెడ్డి నర్సింహారెడ్డి. వాడుకలో ఇద్దరిని ‘బీఎన్‌రెడి’్డ అని సంబోధించేవారు. ఒకే పేరున్న ఇద్దరు ఎన్నికల బరిలో నిలవడంతో పేరు విషయంలో ఓటర్లకు, కార్యకర్తలకు ప్రచారంలో తికమక ఏర్పడింది. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి బీఎన్‌రెడ్డి (బద్దం నర్సింహారెడ్డి), సీపీఎం అభ్యర్థి బీఎన్‌రెడ్డి (భీంరెడ్డి నర్సింహారెడ్డి)పై 34,995 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 1991 ఎన్నికల్లో ఫలితం తారుమారయింది.సీపీఎం అభ్యర్థి బీఎన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి బీఎన్‌రెడ్డిపై 8,263 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని