logo

తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి.

Published : 25 Apr 2024 02:52 IST

రావి నారాయణరెడ్డి

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. ఇప్పటి వరకు మొత్తం 17 సార్లు ఎన్నికలు జరుగగా.. రానున్న మే 13న 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. అయితే తొలి రెండు ఎన్నికల్లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న నల్గొండలో 1951లో పీడీఎఫ్‌ అభ్యర్థులు రావి నారాయణరెడ్డి 2,12,325 ఓట్ల మెజారిటీతో, సుంకం అచ్చాలు 1,95,230 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థులపై విజయం సాధించారు. కాగా ఈ రెండు మెజారిటీలను ఇంత వరకు ఎవరూ అధిగమించకపోవడం గమనార్హం. వీరి తర్వాత 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థి గుత్తా సుఖేందర్‌రెడ్డి 1,93,156 ఓట్ల మెజారిటీతో మూడో స్థానంలో ఉన్నారు. 1971లో టీపీఎస్‌ అభ్యర్థి కంచర్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి వెదిరె నర్సింహారెడ్డిపై 5,398 ఓట్లతో గెలుపొందారు. 17 ఎన్నికల్లో ఇదే అతి తక్కువ మెజారిటీ. 

న్యూస్‌టుడే, మిర్యాలగూడ పట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని