logo

ప్రజాహితం కోరే సీఎం అవసరం: భజన్‌లాల్‌

ఒడిశా ప్రజల హితం కోరే సీఎం రాష్ట్రానికి అవసరమని, నవీన్‌ ఔట్‌సోర్సింగ్‌ ప్రభుత్వానికి కాలం చెల్లిందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌శర్మ చెప్పారు.

Published : 19 May 2024 01:35 IST

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఒడిశా ప్రజల హితం కోరే సీఎం రాష్ట్రానికి అవసరమని, నవీన్‌ ఔట్‌సోర్సింగ్‌ ప్రభుత్వానికి కాలం చెల్లిందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌శర్మ చెప్పారు. శనివారం కొంధమాల్‌ జిల్లా టికాబలి, బొలంగీర్‌ జిల్లా లోయిసింగల్లో జరిగిన భాజపా ఎన్నికల సభల్లో పాల్గొన్న భజన్‌లాల్‌ మాట్లాడుతూ... 25 ఏళ్ల నవీన్‌ పాలనలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయని, ఎంతమంది యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కలిగాయో చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. సుదీర్ఘకాలం పాలించిన సీఎం అన్నిరంగాల్లో విఫలమయ్యారని, మరో అయిదేళ్లు అధికారం ఇవ్వాలని ఓటర్లను కోరడం హాస్యాస్పదమన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ రాష్ట్ర సీఎం మరొకరి సాయంతో మనుగడ సాగిస్తూ ఇంకా పాలిస్తానని చెప్పుకోవడం శోచనీయమని, ప్రజలీసారి స్పష్టమైన తీర్పు చెప్పాలన్నారు. సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడిన భాజపాకు ఓట్లేసి గెలిపించాలని, ప్రధాని మోదీ గ్యారంటీ ఈ రాష్ట్రానికి ఉందని శర్మ పేర్కొన్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని