Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Jun 2024 17:02 IST

1. గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణలో కనిపిస్తాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఆమె ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఐటీ సేవల్లో రాష్ట్రం గుర్తింపు పొందిందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు మరింత అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కౌంటింగ్‌ రోజు వైకాపా కుట్రలను తిప్పికొట్టాలి: చంద్రబాబు

సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ రోజు కూడా అనేక అక్రమాలు, దాడులకు తెగబడే అవకాశం ఉందని, కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్వో వద్ద డిక్లరేషన్ తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ గది నుండి బటయకు రావాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఓట్ల లెక్కింపు తర్వాత భారాస ఖాళీ: కోమటిరెడ్డి

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత భారాసలో ఎవరూ ఉండరని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారాస అధినేత కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వ్యూహం లేకపోవడం వల్లే 1969లో ఉద్యమం విఫలమైంది: కేసీఆర్‌

ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆజన్మ తెలంగాణ వాది అని..  ఈ సమయంలో ఆయన్ను స్మరించుకోకుండా ఉండలేమని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. వ్యూహం లేకపోవడం వల్లే 1969 ఉద్యమం విఫలమైందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మోదీ బిజీ బిజీ.. ఒక్కరోజే ఏడు రివ్యూలు.. ‘100 రోజుల అజెండా’పై దృష్టి!

కేంద్రంలో మూడోసారి అధికారం భాజపాదేనంటూ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువడడంతో కాషాయ పార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. వివిధ అంశాలపై సమీక్షలతో ఆదివారం ప్రధాని మోదీ షెడ్యూల్‌ బిజీ బిజీగా కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశాక అమలు చేయాల్సిన ‘తొలి 100 రోజుల’ ప్రణాళికపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఇవి ఎగ్జిట్ పోల్స్‌ కావు.. మోదీ పోల్స్‌: రాహుల్‌ గాంధీ

కేంద్రంలో భాజపా రికార్డు స్థాయిలో మూడోసారి గెలుస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ఇవి ఎగ్జిట్ పోల్స్ కావని.. మోదీ మీడియా పోల్స్ అని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి 295 సీట్లు సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అరుణాచల్‌లో మళ్లీ భాజపా సర్కార్‌.. ఎస్‌కేఎందే సిక్కిం..

అరుణాచల్‌ ప్రదేశ్‌లో మళ్లీ భాజపానే అధికారం కైవసం చేసుకుంది. ఆ పార్టీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 60 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో భాజపా 46 సీట్లలో గెలుపొందింది. వీటిలో 10 సీట్లు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. 50 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగ్గా.. భాజపా 36 స్థానాల్లో విజయం సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మొన్న నంబర్ 1పై.. నేడు నంబర్‌ 2పై విజయం.. టాప్‌ - 10లోకి ప్రజ్ఞానంద

భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద మరోసారి సత్తా చాటాడు. తెలివిగా పావులు కదిపి చెస్‌లో ప్రపంచ నంబర్ 2 ఫాబియానో కరువానాను ఓడించాడు. వరుసగా టాప్‌ ప్లేయర్లను ఓడించిన భారత స్టార్‌ అంతర్జాతీయ చెస్‌ ఫెడరేషన్‌ (FIDE) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 10లోకి దూసుకొచ్చాడు. నాలుగు ర్యాంకులను మెరుగుపర్చుకొని పదో స్థానం సాధించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దేశంలోనే సుదీర్ఘ కాలం సీఎం.. 39 ఏళ్లలో తొలి ఓటమి

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (SDF)కు ఘోర పరాభవం ఎదురైంది. 2019 వరకు అప్రతిహతంగా 25 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన ఈ పార్టీ.. ప్రస్తుతం 32 స్థానాల్లో కేవలం ఒక్కసీటుకే పరిమితమైంది. పార్టీ అధినేత, దేశంలోనే సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ సీఎం పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ సైతం పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమిని మూటగట్టుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. స్టార్టప్‌లు నేర్పిన పాఠాలివే: గజల్‌ అలఘ్‌

వ్యాపార రంగంలో రాణించడం అంటే సాధారణ విషయం కాదు. చాలా మంది సొంత ఆలోచనలతో స్టార్టప్‌లు (startups) మొదలు పెట్టి ఆ సంస్థను విజయవంతమైన మార్గంలో నడిపిస్తున్నారు. అలాంటి వాళ్లలో బ్యూటీ బ్రాండ్ మామాఎర్త్‌ సహ-వ్యవస్థాపకురాలు గజల్ అలఘ్‌ కూడా ఒకరు. తాజాగా స్టార్టప్‌ల వల్ల తాను నేర్చుకున్న విలువైన పాఠాలను ‘‘ఎక్స్‌’’ వేదికగా షేర్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని