logo

సవాళ్లను యువత ధైర్యంగా స్వీకరించాలి: గవర్నర్‌

యువత ధైర్యంగా సవాళ్లను స్వీకరించాలని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పిలుపునిచ్చారు. తరమణిలోని నిఫ్ట్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ) స్నాతకోత్సవం శుక్రవారం జరిగింది

Published : 26 Nov 2022 00:24 IST

ఓ విద్యార్థినికి పట్టా ప్రదానం చేస్తున్న ఆర్‌ఎన్‌ రవి

చెన్నై, న్యూస్‌టుడే: యువత ధైర్యంగా సవాళ్లను స్వీకరించాలని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పిలుపునిచ్చారు. తరమణిలోని నిఫ్ట్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ) స్నాతకోత్సవం శుక్రవారం జరిగింది. ఇందులో గవర్నర్‌ 33 మందికి పతకాలు సహా 263 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గతంలో ప్రపంచంలో అతిపెద్ద జౌళి ఉత్పత్తిదారుగా భారత్‌ ఉందన్నారు. చరిత్రలో జౌళి, వస్త్ర రంగాన్ని శాసించిందని తెలిపారు. పురాతన, సంక్లిష్టమైన గిరిజన డిజైన్లు సహా వస్త్రాల్లో స్థానిక సృజనాత్మకతను ప్రస్తావించారు. వాటిని యువత ప్రోత్సహించాలని, ప్రేరణ పొందాలని సూచించారు. యువతలో నిగూఢమైన శక్తి, ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీయడం ద్వారా దేశం తన వందో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనుందని తెలిపారు. అనిశ్చితి, ఎదురు దెబ్బలకు భయపడకుండా పెద్ద కలలు కనాలని హితవు పలికారు. కష్టపడి పనిచేయాలని, సవాళ్లను స్వీకరించాలని పిలుపునిచ్చారు. దేశానికి యువ మేధావులను అందించిన సంస్థ సేవలను అభినందించారు. కార్యక్రమంలో నిఫ్ట్‌ చెన్నై డైరెక్టరు డాక్టర్‌ అనితా మనోహర్‌, డీన్‌ (అకాడమిక్స్‌) డాక్టర్‌ వందనా నారంగ్‌, జాయింట్‌ డైరెక్టరు డాక్టరు రఘురామ్‌ జయరామన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని