logo

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు

పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.

Published : 19 Apr 2024 04:30 IST

నిందితులు సత్యనారాయణ, ప్రవీణ్‌

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన ఓ వ్యక్తి జుత్తాడలో ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటికి పన్ను విధించాలని గ్రేడ్‌-1 పంచాయతీ కార్యదర్శి వి.సత్యనారాయణ, గ్రేడ్‌-5 పంచాయతీ కార్యదర్శి కొర్ర విక్టర్‌ ప్రవీణ్‌లను కోరాడు. ఆ మేరకు వారిద్దరూ రూ.10 వేలు లంచం డిమాండ్‌ చేశారు. తాను జిల్లా పరిషత్‌లో పని చేస్తున్నానని, అంత లంచం ఇచ్చుకోలేనని చెప్పినా వినిపించుకోలేదు. రూ.3 వేలు లంచం ఇస్తానని చెప్పినా అంగీకరించకపోవడంతో రూ.8 వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం విషయాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులకు బాధితుడు తెలియజేశాడు. ఆ మేరకు గురువారం సాయంత్రం వాలిమెరక జుత్తాడ గ్రామ సచివాలయం వద్ద ఏసీబీ అధికారులు వలపన్ని నిందితులను పట్టుకున్నారు. రాత్రి 11 గంటల వరకు ఏసీబీ అధికారులు విచారణ కొనసాగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని