logo

ఇంటి నుంచి ఓటుకు 26 వరకు గడువు

ఇంటి నుంచి ఓటు కోసం వయోవృద్ధులు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకొనే గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 23 Apr 2024 04:22 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఇంటి నుంచి ఓటు కోసం వయోవృద్ధులు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకొనే గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18న బీఎల్‌ఓలు వయోవృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి 12డి ఫారాలను అందజేసి దరఖాస్తులను స్వీకరించారన్నారు. ఇంకా కొందరు మిగిలి ఉండడంతో, వారి కోసం ఈనెల 26 వరకు గడువు పొడిగించారన్నారు. ఎన్నికల విధులకు నియమితులైన ఉద్యోగులు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీ సహాయ రిటర్నింగ్‌ అధికారుల (ఏఆర్‌ఓ)ను నియమించినట్లు వెల్లడించారు. భీమిలికి ఆనందపురం తహసీల్దార్‌ హేమంత్‌కుమార్‌, తూర్పునకు భీమిలి డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి లక్ష్మీపతి, విశాఖ దక్షిణానికి ప్రత్యేక తహసీల్దార్‌ భుజంగరావు, విశాఖ ఉత్తరానికి ములగాడ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ మిశ్రా, గాజువాకకు పెదగంట్యాడ తహసీల్దార్‌ భాస్కర్‌రావు, పెందుర్తికి సబ్బవరం తహసీల్దార్‌ చలమయ్యను సంప్రదించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని