logo

రసాభాసగా మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం

సబ్బవరం మండల సర్వసభ్య సమావేశం స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది.

Published : 23 Apr 2024 04:29 IST

మాట్లాడుతున్న ఎంపీపీ బోకం సూర్యకుమారి

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండల సర్వసభ్య సమావేశం స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. దీనికి ఎనిమిది అధికారులు డుమ్మా కొట్టారు. వీరిలో ఆర్‌అండ్‌బీ, తహసీల్దారు కార్యాలయం, టీ.ఆర్‌ఐ ఇంజినీర్‌, మండల పరిషత్‌ ఇంజినీర్‌, అటవీ శాఖ, ఆర్టీసీ సివిల్‌ సప్లై, రెవెన్యూ, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖాధికారులు ఉన్నారు. వీరిపై ఎంపీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ తీర్మానం లేకుండా ఆర్‌డబ్ల్యూఎస్‌ పనులు చేయడం పట్ల నారపాడు సర్పంచి మామిడి శంకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎంపీడీవో రామ మోహన్‌నాయుడు స్పందిస్తూ ఇందుకు నిధులున్నాయని త్వరలోనే మరమ్మతులు చేయిస్తామన్నారు.

  • తవ్వవానిపాలెం జల్‌జీవన్‌ మిషన్‌ కింద అయిన మంజూరు, ఖర్చు, మిగులు వంటి వాటి గురించి చెప్పాలని సర్పంచి బోకం సోమునాయుడు నిలదీశారు. ప్రస్తుతం పని నిలిపివేయడానికి కారణమేంటని ఆయన ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ పి.జయలక్ష్మిని ప్రశ్నించారు. గ్రామంలో ఇంకా 20 కొళాయిలు వేయాల్సి ఉందని ఆమె బదులిచ్చారు.
  • ఆదిరెడ్డిపాలెంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎంపీటీసీ దేముడు బాబు కోరారు. మల్లునాయుడుపాలెంలో కూడా మంచినీటి కనెక్షన్లు ఇవ్వలేదని గొర్లె కనకరాజు ఫిర్యాదు చేశారు. పైడివాడ గ్రామంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫారంలు వేయాలని గత నాలుగు సంవత్సరాలుగా కోరుతన్నా అధికారులు పట్టించుకోలేదని సర్పంచి వడ్డాది అప్పలరాజు అన్నారు. దీనిపై ఏఈ వీరేంద్ర సమాధానం ఇస్తూ కొత్త ట్రాన్స్‌ఫారంలు పెట్టామన్నారు. కార్యక్రమానికి 20 మంది ఎంపీటీసీలకు 10మంది హాజరయ్యారు. ఎంపీడీవో ఎస్‌ రాంమోహన్‌నాయుడు, ఏవో బాబూరావు, వైస్‌ ఎంపీపీలు ఝాన్సీలక్ష్మీరాణి, చొక్కాకుల గోవింద పాల్గొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని