logo

అర్హత లేని వైద్యం.. అక్రమంగా మందుల విక్రయం

జిల్లా కేంద్రంలో ఓ అర్హత లేని వైద్యుడు చికిత్సలు చేయడమే కాకుండా ఎలాంటి అనుమతుల లేకుండా భారీగా మందులను విక్రయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మందులను కూడా విక్రయిస్తూ డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సంఘటన గురువారం జనగామలో చోటుచేసుకుంది.

Published : 19 Apr 2024 04:52 IST

క్లినిక్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు

జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో ఓ అర్హత లేని వైద్యుడు చికిత్సలు చేయడమే కాకుండా ఎలాంటి అనుమతుల లేకుండా భారీగా మందులను విక్రయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మందులను కూడా విక్రయిస్తూ డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సంఘటన గురువారం జనగామలో చోటుచేసుకుంది. వరంగల్‌ అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ రాజ్యలక్ష్మి కథనం ప్రకారం.. పట్టణంలోని సూర్యాపేట మెయిన్‌ రోడ్డు వైపు శోభ క్లినిక్‌ పేరిట చింతకింది యాదగిరి అనే ఆర్‌ఎంపీ ఎలాంటి అర్హతలు లేకున్నా మూడు పడకలు ఏర్పాటు చేసి మందులను విక్రయిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించే మందులను కూడా విక్రయిస్తున్నారని తెలిపారు. అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ రాజ్యలక్షి, జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు బాలకృష్ణ, అరవింద్‌ సదరు క్లినిక్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.  ఇందులో రూ.45వేల విలువైన మందులను, రాష్ట్ర ప్రభుత్వ ముద్రతో ఉన్న యాంటీబయాటిక్స్‌ ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌పేషెంట్లకు కూడా చికిత్సలు చేయిస్తున్నట్లు తేలడంతో వారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు కూడా తనిఖీలో పాల్గొన్నారు. అర్హత, అనుమతులు లేకుండా వైద్యం, మందులను విక్రయిస్తున్నందుకు యాదగిరిపై డ్రగ్‌ కంట్రోల్‌ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు బాలకృష్ణ తెలిపారు. జిల్లా న్యాయస్థానంలో విచారణ జరగనుందని ఆయన పేర్కొన్నారు.

పట్టుబడిన మందులు

 

నిందితుడు యాదగిరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని